విగ్రహానికి పూలమాల వేస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్
ఆవిష్కరించిన డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సెత్పతీ
విశాఖపట్నం, జనవరి 27: మర్రిపాలెం రైల్వే థీమ్ పార్కులో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సెత్పతీ గురువారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడి నిర్వాసితుల కాలనీ కేర్ కమిటీ (సీసీసీ) పార్కును అభివృద్ధి చేయడంతోపాటు సొంత నిధులతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బహిరంగ వ్యాయామ శాల, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కు సదుపాయం చెట్ల సంరక్షణ చేస్తున్న సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సీసీసీ సంస్థ ప్రతినిధులు, కాలనీ నివాసితులు పాల్గొన్నారు.