రైల్వే స్టేషన్‌లో దిగి లగేజీతో తిప్పలు పడుతున్నారా.. అయితే మీకో Good News..

ABN , First Publish Date - 2022-05-27T13:00:46+05:30 IST

స్టేషన్‌లో రైలు దిగి లగేజీతో తిప్పలు పడే ప్రయాణికులకు..

రైల్వే స్టేషన్‌లో దిగి లగేజీతో తిప్పలు పడుతున్నారా.. అయితే మీకో Good News..

  • Station To Bus Stop..
  • అందుబాటులో ఆర్టీసీ మినీ బస్సు.. 
  • 2 కిలోమీటర్లకు ఎంతంటే..రూ.5

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలు దిగి లగేజీతో తిప్పలు పడే ప్రయాణికులకు ఆర్టీసీ సౌకర్యవంతమైన సేవలను అందించనుంది. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని బస్టాపులకు, మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు ఉచిత బ్యాటరీ వాహనాలను, మినీ బస్సును అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు అధికారులు రైల్వేస్టేషన్‌ ముఖ ద్వారం వద్ద మూడు విద్యుత్‌ కార్లను ఉంచనున్నారు. స్టేషన్‌లో రైలు దిగిన ప్రయాణికుల్ని సమీప బస్టాపులకు ఉచితంగా తీసుకెళ్లనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 3 నుంచి రాత్రి 7 మధ్య ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.


ఫైవ్‌ స్టార్‌ మినీ బస్సు..

రైలు ప్రయాణికులకు, ఆర్టీసీ ప్రయాణికులకు అనుసంధానంగా స్వల్ప చార్జీలతో ఫైవ్‌ స్టార్‌ మినీ బస్సును ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న బస్టాపులో రూ. 5 చార్జీతో ప్రయాణికులను చేరవేసేందుకు వీటిని వినియోగించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపం లోని జీడిమెట్ల, రసూల్‌పురా, అల్వాల్‌, చార్మినార్‌, ఆబిడ్స్‌, సనత్‌నగర్‌, తిరుమలగిరి బస్టాపుల్లో రైలు ప్రయాణికుల్ని దింపేందుకు పదో నెంబరు బస్టాపు నుంచి మినీ బస్సు అం దుబాటులో ఉంచనున్నారు. స్టేషన్‌ ఆవరణ లో, బోయగూడ రైల్వేస్టేషన్‌ వైపు (10 నెం బర్‌ ప్లాట్‌ఫాం) ఆర్టీసీ ఏర్పాటు చేసిన కౌం టర్ల వద్ద విద్యుత్‌ కార్లు, మినీబస్సు సేవల కోసం సంప్రదించవచ్చు. ఆర్టీసీ చరిత్రలోనే వినూత్న సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సికింద్రాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ అపర్ణ కళ్యాణ్‌ తెలిపారు.

Updated Date - 2022-05-27T13:00:46+05:30 IST