ఆయుష్మాన్‌ భారత్‌ అమలుకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2022-07-02T06:28:57+05:30 IST

రాష్ట్రంలో ఆయుష్మాన్‌భారత్‌ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు అన్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ అమలుకు పటిష్ట చర్యలు
ఆయుష్మాన్‌ భారత్‌ శిక్షణలో పాల్గొన్న ఎంటీ కృష్ణబాబు తదితరులు

ఆయుష్మాన్‌ భారత్‌ అమలుకు పటిష్ట చర్యలు

ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు 

వన్‌టౌన్‌,జూలై 1: రాష్ట్రంలో ఆయుష్మాన్‌భారత్‌ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లివారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం అమలు కోసం నియమితులైన ఎంఎల్‌హెచ్‌పీలకు శుక్రవారం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంఓల్‌హెచ్‌పీ వ్యవస్థలో దేశం అంతటా 5000 జనా భాకు ఒకరు ఉండగా, ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి సూచనలు మేరకు రాష్ట్రంలో 2500 జనాభాకు ఒకరు చొప్పున, ప్రతి సచివాలయాన్ని ఒక ఎంఎల్‌హెచ్‌పీ , సచివాలయ ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తల ఒక టీంగా ఏర్పడి వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ ద్వారా ప్రతి కుటుంబాన్ని సందర్శిస్తారన్నారు. కుటుంబాలలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని వాకబు చేసి వారికి నమ్మకం కలిగిస్తా రన్నారు. శాఖ కమిషనర్‌ , మిషన్‌ డైరెక్టర్‌ జె.నివాస్‌, ఎన్‌ఎల్‌హెచ్‌పీలకు శిక్షణ ఏర్పాటు చేయడం ద్వారా వారిలో నైపుణ్యం పెరుగుతుందన్నారు. రాష్ట్ర కార్యక్రమ మేనేజర్‌ అప్పారావు, డాక్టర్‌ రామిరెడ్డి, కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని ఇంకా పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:28:57+05:30 IST