Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్ర వాలీబాల్‌ పోటీలకు వీరంపల్లి విద్యార్థినులు

మనుబోలు, డిసెంబరు 5: అండర్‌-18 విభాగంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు మండలంలోని వీరంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాఽధ్యాయుడు మల్లికార్జున ఆదివారం తెలిపారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి  స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ జట్టులో వీరంపల్లి విద్యార్థినులు మౌనిక, అస్మా, హమీదా తమ ప్రతిభ కనబరిచి చోటు దక్కించుకున్నారు. ఈ నెల 10, 12 తేదీల్లో అనంతపురంలో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో జిల్లా జట్టు ఆడనున్నట్లు పీఈటీ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు వెళుతున్న విద్యార్థినులను వీరంపల్లి పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం మహ్మద్‌రఫీ, ఉపాధ్యాయులు అభినందించారు.

 

Advertisement
Advertisement