Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపిక

దుగ్గొండి, అక్టోబరు 25: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో 17మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి సుధాకర్‌ వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20ఏళ్లు దాటిన వారు 50 మంది క్రీడాకారులు పాల్గొనగా ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసిట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైనవారిలో ప్రీస్టైల్‌ విభాగంలో 52కిలోల విభాగంలో ఎం.రవికుమార్‌(మచ్చపూర్‌), 61కిలోల విభాగంలో బి.అఖిల్‌(అక్కల్‌చడ), 65కిలోల విభాగంలో ఎస్‌.నవీన్‌(మేడపల్లి), 70కిలోల విభాగంలో ఎస్‌.మహేశ్‌(గురిజాల), 74కిలోల విభాగంలో ఎస్‌.రాకేశ్‌(పంథిని) ఎంపికయ్యారు. గ్రీక్‌ రోమన్‌ విభాగం 55కిలోల విభాగంలో ప్రీతమ్‌(తక్కళ్లపాడ్‌), 60కిలోల విభాగంలో బి.సురేశ్‌(దిక్షకుంట్ల), 63కిలోల విభాగంలో ఆర్‌.మహేశ్‌(కల్లెడ),  67కిలోల విభాగంలో బి.అశ్వంత్‌(దుగ్గొండి), 72 కిలోల విభాగంలో  ఎన్‌.రాజేశ్‌(వరంగల్‌),  77కిలోల విభాగంలో ఎన్‌.శ్రీకాంత్‌(మైలారం),  82కిలోల విభాగంలో మోహిన్‌(కొప్పుర్‌), 87కిలోల విభాగంలో  అనురాధ(ఆత్మకూరు) బాలికల విభాగంలో 50కిలోల విభాగంలో బి.రాజేశ్వరి(కల్లెడ), 53 కిలోల విభాగంలో ఎన్‌.వినోద(మడికొండ) 55కిలోల విభాగంలో సీహెచ్‌.మౌనిక(ముళ్లకట్ట, ఏటూర్‌నాగారం) ఎంపికైనట్లు అసోసియేషన్‌ కార్యదర్శి సుధాకర్‌ తెలిపారు. క్రీడలకు కోచ్‌లుగా కందికొండ రాజు, దేవేందర్‌ వ్యవహరించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 28న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగే రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొంటారని సుధాకర్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement