ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2022-09-29T06:01:54+05:30 IST

అరకులోయలోని క్రీడా పాఠశాల ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్‌ రెడిడెన్షియల్‌ పాఠశాలల క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి.

ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేస్తున్న కుంభా రవిబాబు

అరకులోయ, సెప్టెంబరు 28: అరకులోయలోని క్రీడా పాఠశాల ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్‌ రెడిడెన్షియల్‌ పాఠశాలల క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు మాట్లాడుతూ ఈ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు డిసెంబరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్‌ మూర్తి ఆధ్వర్యంలో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను ఆయన అందజేశారు. 

విజేతలు వీరే..

అండర్‌- 14 బాలికల 100 మీటర్ల రన్నింగ్‌లో మొదటి స్థానంలో పి.శ్రీకన్య(జీఎల్‌ పురం), ద్వితీయ.. ఎస్‌.మోహిని దుర్గాశివాని(జీకే వీధి), తృతీయ.. పి.హిమబిందు(వై.రామవరం), అలాగే 200 మీటర్లలో ఎస్‌.మోహిని దుర్గాశివాని(జీకే వీధి), పి.శ్రీకన్య(జీఎల్‌ పురం), కె.మమత (చిత్తూరు) నిలిచారు. 400 మీటర్లలో ఎం.గిరిజాలత(మారేడుమిల్లి), కె.మమత(చిత్తూరు),  డి.నీలిమ(చిత్తూరు) విజేతగా నిలిచారు. షాట్‌పుట్‌లో కె.దేవలక్ష్మి(డుంబ్రిగుడ), ఆర్‌.అఖిల (డోర్నాల), కె.దుర్గ(మారేడుమిల్లి)... ఆర్చరీలో డుంబ్రిగుడ ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలకు చెందిన కిల్లో మెతుల, గెమ్మెల శిరీషా, పూజారి అనిత వరుసగా మూడు స్థానాలను దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్‌  డబుల్స్‌లో వై.రామవరం, సింగిల్స్‌లో చిత్తూరు నిలిచాయి. చెస్‌లో విన్నర్‌గా సీహెచ్‌.శ్రీవల్లి(వై.రామవరం) నిలిచింది. రెస్లింగ్‌లో 50 కిలోల కేటగిరీలో సీహెచ్‌ మైథిలి(డోర్నాల), కె.మధులత(మారేడుమిల్లి), మౌనికాభాయి(డోర్నాల), యు.చంద(డోర్నాల) నిలిచారు. 53 కిలోల కేటగిరీలో ఓ.గాయిత్రి(డోర్నాల), ఓ.హారికాశ్రీ(మారేడుమిల్లి), కె.దుర్గ (మారేడుమిల్లి).. 55 కిలోల కేటగిరీలో ఎం.శ్వేత(మారేడుమిల్లి), కె.లోకేశ్వరి(వై.రామవరం), ఎం.శ్రావణిబాయి(డోర్నాల) నిలిచారు. 59 కిలోల కేటగిరీలో ఎ.లిఖిత శ్రీవల్లీ(వై.రామవరం) నిలిచింది.  

బాలుర విభాగంలో..

డిస్క్‌ త్రో ఎం.జాన్‌(జీకే వీధి), జావిలిన్‌ త్రోలో జి.బాబూరావు(జీకే వీధి), ట్రిపుల్‌ జంప్‌లో టి.ఓంకార్‌(డుంబ్రిగుడ) ప్రథమ స్థానంలో నిలిచారు., హ్యాండ్‌బాల్‌లో డుంబ్రిగుడ ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాల, వాలీబాల్‌లో జీకే వీధి పాఠశాల నిలిచాయి. లాంగ్‌ జంప్‌లో పి.క్రిష్ణ(డుంబ్రిగుడ), హైజంప్‌లో సీహెచ్‌ చరణ్‌కుమార్‌(రాజ ఒమ్మంగి) ప్రథమ స్థానంలో నిలిచారు.


Updated Date - 2022-09-29T06:01:54+05:30 IST