పీజీ ప్రవేశాలకు రాష్ట్రస్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-05-18T05:21:38+05:30 IST

రానున్న నూతన విద్యాసంవత్సరం నుంచి అనుబంధ కోర్సు పీజీ కళాశాలలో ప్రవేశానికి రాష్ట్రస్థాయి (ఏపీపీజీసెట్‌) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడించారు.

పీజీ ప్రవేశాలకు రాష్ట్రస్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్ష

కడప(వైవీయూ), మే 17: రానున్న నూతన విద్యాసంవత్సరం నుంచి అనుబంధ కోర్సు పీజీ కళాశాలలో ప్రవేశానికి రాష్ట్రస్థాయి (ఏపీపీజీసెట్‌) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీఆర్‌సెట్‌) ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నామని, ఇందులో 160 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, 40 మార్కులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. జీయాట్‌ఏట్‌జేఆర్‌ఎస్‌ అభ్యర్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రాజెక్టు ఫెలోలకు పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంటర్వ్యూ వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా హాజరు కావాల్సి ఉంటుందన్నారు. జగనన్న వసతి దీవెన అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను ఈ నెల 19వ తేదీ లోపు తమకు పంపాలని విశ్వవిద్యాయాలకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ నరసింహారెడ్డి, వీసీ సూర్యకళాశాల, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, పీడీసీ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, పీఆర్‌వో సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:21:38+05:30 IST