రాష్ట్రస్థాయి హాకీ విజేత విశాఖ

ABN , First Publish Date - 2022-01-27T06:26:33+05:30 IST

పట్టణంలోని రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు సాగిన 12వ రాష్ట్రస్థాయి జూనియర్‌ మెన్‌ హాకీ పోటీల విజేతగా విశాఖ జిల్లా జట్టు నిలిచింది. ద్వితీయ స్థానం నెల్లూరు, తృతీయ, చతర్థు స్థానానాలు అనంతపురం, చిత్తూరు జిల్లాల జట్లు కైవసం చేసుకున్నాయి.

రాష్ట్రస్థాయి హాకీ విజేత విశాఖ
విజేతగా నిలిచిన విశాఖ జట్టుకు కప్‌ అందిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి సాయికుమారి

 ద్వితీయ, తృతీయ స్థానాల్లో  నెల్లూరు, అనంతపురం జట్లు

 విజేతలకు సీనియర్‌ సివిల్‌ జడ్జి సాయికుమారి 

బహుమతుల ప్రదానం

ఎలమంచిలి, జనవరి 26 : పట్టణంలోని రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు సాగిన 12వ రాష్ట్రస్థాయి జూనియర్‌ మెన్‌ హాకీ పోటీల విజేతగా విశాఖ జిల్లా జట్టు నిలిచింది. ద్వితీయ స్థానం నెల్లూరు, తృతీయ, చతర్థు స్థానానాలు అనంతపురం, చిత్తూరు జిల్లాల జట్లు కైవసం చేసుకున్నాయి. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగిన ఈ పోటీల ఫైనల్‌ మ్యాచ్‌ బుధవారం ఉదయం నిర్వహించారు.  విశాఖ, నెల్లూరు జట్ల మధ్య నువ్వా.. నేనా.. అన్న రీతిలో జరిగాయి. చివరకు నెల్లూరు జట్టుపై విశాఖ జట్టు 2-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. అధిక గోల్స్‌ చేసిన  నెల్లూరు జట్టుకు చెందిన పవన్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా ఎంపిచేశారు. అనం తరం సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.సాయికుమారి విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై మక్కువ చూపితే భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ టి.కృష్ణవేణి, బంగారు శెట్టి, ఎలమంచిలి హాకీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జీవీరెడ్డి, కొఠారు నరేశ్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధి డి.వెంకటరావు, క్రీడాకారులు దాసరి మహేశ్‌, కోచ్‌ రమేశ్‌, మునిసిపల్‌ మేనేజర్‌ ప్రబాకర్‌రావు, కోచ్‌లు రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-27T06:26:33+05:30 IST