Abn logo
Sep 17 2021 @ 00:09AM

విలువిద్య రాష్ట్రస్థాయి పోటీలకు వెస్ట్‌బెర్రీ విద్యార్థులు

విద్యార్థులను అభినందిస్తున్న డైరెక్టర్‌ మహేష్‌

భీమవరం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 16 : జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో వెస్ట్‌బెర్రీ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్కూల్‌ డైరెక్టర్‌ మహేష్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12న జంగారెడ్డిగూడెంలో ఏపీ ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్యర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని కె. సుష్మిత ద్వితీయ స్థానం, ఆరో తరగతికి చెందిన ఎ.కనిష్క నాలుగో స్థానం కైవసం చేసుకున్నారు. వీరిద్దరు విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులను ఆయనతో పాటు ప్రిన్సిపాల్‌  సత్యవోలు హేమవతి, ఉపాధ్యాయులు అభినందించారు.