రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-24T05:46:19+05:30 IST

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూ ఖీ, జిల్లా ఎస్పీప్రవీణ్‌కుమార్‌లు అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, మే 23 : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూ ఖీ, జిల్లా ఎస్పీప్రవీణ్‌కుమార్‌లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో జూన్‌ 2వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... కరోనా వలన గత రెండు సంవత్సరాలు మామూలుగా జరుపుకోవడం జరిగింద న్నారు. ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా వేడుకలను ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో జరుపుకోవడం జరుగుతుందని, అందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా జూన్‌ 2న జిల్లా, డివిజన్‌, మండలం, పంచాయ తీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. 3 రోజుల పాటు కార్యాలయంలో విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయా లని అన్నారు. ప్రతీఒక్కరు ప్లాగ్‌కోడ్‌ను పాటించాలని, ప్లాస్టిక్‌ప్లాగ్‌ ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని అన్నారు. వేడుకల సందర్భంగా అంత రాయం కలగకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన ఆ వార్డులలిస్టును 28వ తేదీలోగా సమర్పిం చాలని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమం, మైదానం అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సాయంత్రం కవిసమ్మేళనం అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేయడం జరిగిందని, అందరు ఈ కార్యక్రమం లో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, అడిషనల్‌ ఎస్పీ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నర్సాపూర్‌(జి), మే 23 : నర్సాపూర్‌(జి)లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... ధాన్యాన్ని త్వరగా రైస్‌ మిల్లులకు తరలించాలని, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, త్వరగా రవాణా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తుకారాం, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, గిర్దావర్‌ వేణుగోపాల్‌, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:46:19+05:30 IST