రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జన్సీ దిశగా నడుస్తోంది: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-09-03T21:26:55+05:30 IST

రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జన్సీ దిశగా నడుస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి కొత్తగా నగదుబదిలీ పథకం అంటున్నారని విమర్శించారు.

రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జన్సీ దిశగా నడుస్తోంది: దేవినేని ఉమ

అమరావతి: రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జన్సీ దిశగా నడుస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి కొత్తగా నగదుబదిలీ పథకం అంటున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన రాజకీయభిక్షతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు బూతులమంత్రిగా ఉన్న వ్యక్తి ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడని మండిడపడ్డారు. సీఎం జగన్ ఆనందం కోసం టీడీపీ వాళ్లను తిట్టడం మానేసి.. గుడివాడలో పేకాట కేంద్రాలను ఎమ్మెల్యే నాని మూసేయిస్తే మంచిదని సూచించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో వసంత కృష్ణప్రసాద్ అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని, కృష్ణప్రసాద్ మిడిసిపడటం మానేసి తన అవినీతిపై సీబీఐ విచారణ కోరాలన్నారు. సజ్జా అజయ్ పై దాడిచేసింది కృష్ణప్రసాద్ గూండాలేనని దేవినేని ఉమ అన్నారు.

Updated Date - 2020-09-03T21:26:55+05:30 IST