వలస కార్మికుల విషయంలో రాష్ట్రాలు మెరుగ్గా పనిచేయాల్సింది: నీతి ఆయోగ్ సీఈవో

ABN , First Publish Date - 2020-05-23T22:32:10+05:30 IST

కరోనా వల్ల ప్రపంచం ఏ స్థాయిలో నష్టపోతోందో పక్కనపెడితే.....

వలస కార్మికుల విషయంలో రాష్ట్రాలు మెరుగ్గా పనిచేయాల్సింది: నీతి ఆయోగ్ సీఈవో

న్యూఢిల్లీ: కరోనా వల్ల ప్రపంచం ఏ స్థాయిలో నష్టపోతోందో పక్కనపెడితే.. లాక్‌డౌన్ వల్ల మాత్రం రాష్ట్రంలోని వలస కూలీలు తీవ్రంగా కష్టపడ్డారు.  ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఇంటికి తీసుకెళ్లాలని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను తరలిస్తున్నాయి. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు అంత గొప్పగా లేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించే విషయంలో రాష్ట్రాలు మరింత మెరుగ్గా పనిచేసి ఉండాల్సిందని అన్నారు.


భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పారు. ఆఖరి కార్మికుడిని తమ ఇంటికి చేర్చే వరకు ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు.

Updated Date - 2020-05-23T22:32:10+05:30 IST