మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-09-18T05:16:31+05:30 IST

మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
కల్కి చెరువులో చేప పిల్లలను విడుదల చేస్తున్న స్పీకర్‌ పోచారం

నిజాంసాగర్‌/బీర్కూర్‌, సెప్టెంబరు 17: మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రిజర్వాయర్లు, చెరువులు, సాగు నీటి వనరుల్లో రూ.92 కోట్లతో 100 కోట్ల చేప పిల్లలను ప్రతీ సంవత్సరం విడుదల చేస్తోందన్నారు. పట్టణంలోని స్పీకర్‌ నివాసంలో ఉత్త మ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ నియో జక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17కోట్లతో 170 అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులను మంజూరు చేశామన్నారు. రూ.9 కోట్లతో 100 అంగన్‌వాడీ భవ నాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. అలాగే దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 పడకల ఐసీయూ వార్డులో బోడ గంగారెడ్డి-శారదారెడ్డిల జ్ఞాపకార్థం రూ.30లక్షలతో చేపట్టిన పరికరాలను స్పీకర్‌ ప్రారం భించారు. ఇటీవలే రూ.20కోట్లతో మాత, శిశు ఆస్పత్రిని నిర్మించి సేవలు ప్రారంభించామన్నా రు. బాన్సు వాడ ప్రాంతానికి నూతనంగా ప్రభుత్వ డిగ్రీ నర్సింగ్‌ కళాశాలను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారని, కళాశాల భవన నిర్మాణానికి రూ.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

Updated Date - 2021-09-18T05:16:31+05:30 IST