రౌడీయిజం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-03-02T07:33:00+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారుల ద్వారా రౌడీయిజం చేస్తోందని, అయినా భయపడేదిలేదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

రౌడీయిజం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఓడీసీలో కదిరి - హిందూపురం ప్రఽధాన రోడ్డుపై నిరసన తెలుపుతున్న దృశ్యం

ఫరేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు  అడ్డగించడం అనైతికం

మండిపడిన   మాజీ మంత్రి పల్లె  

ఘటనకు నిరసనగా పలు  చోట్ల టీడీపీ శ్రేణుల ఆందోళన


పుట్టపర్తి, మార్చి 1: వైసీపీ ప్రభుత్వం అధికారుల ద్వారా రౌడీయిజం చేస్తోందని, అయినా భయపడేదిలేదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబును సోమవారం చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడంపై పల్లె మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి టీడీపీ జెండాలు చేతపట్టి నిరసన చేపట్టారు. అనంతరం  మాట్లాడుతూ..  చంద్రబాబును గౌరవాన్ని కించపరిచేవిధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలలు అనైతికమన్నారు. వాటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. త్వరలోనే తగిన గుణపాఠం చెబుతార ంటూ హెచ్చరించారు. అధికారుల బెదిరింపులకు టీడీపీ బెదిరేది లేదని అన్నారు. తమ పార్టీకి, అధినేతకు ప్రజల అండ ఉందని పేర్కొన్నారు. 


చంద్రబాబును అడ్డుకోవడం అమానుషం

పుట్టపర్తి: టీడీపీ అఽధినేత చంద్రబాబునాయుడును పోలీసులు అడ్డుకోవడం అమానుష నమని టీడీపీ నాయకులు విమర్శించారు.   రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు పట్ల పోలీసు అఽధికారులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ పట్టణంలోని బస్టాండ్‌ వద్ద టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. వైసీపీ సర్కారు అధికార అండ చూసుకుని పెట్రేగిపోతోందన్నారు. ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు సామకోటి ఆదినారాయణ, ఓబుళేశు, హైమావతి, సత్యనారాయణ, సర్పంచ ప్రవీణ్‌కుమార్‌, ఇస్మాయిల్‌, రమేశ, రామక్రిష్ణ, నారాయణ, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.


 టీడీపీ నాయకుల నిరసన 

కొత్తచెరువు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు,   చంద్రబాబునాయుడు  రేణిగుంట విమానాశ్రయంలో  పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. మండలకేంద్రంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు  స్థానిక నాలుగురోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాలక్కగారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటివన్నారు.  వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామ్య బద్దంగా పాలన చేస్తోందని విమర్శించారు.  కార్యక్రమంలో  మండల కన్వీనర్‌రామకృష్ణ, కో కన్వీనర్‌ శ్రీనివాసులు, జడ్పీటీసీ అభ్యర్థి బోయరాజు, ఎంపీటీసీ అభ్యర్థి నాగేంద్రప్రసాద్‌, నాయకులు గాజులచంద్రమోహన, బండ్లపల్లికేశప్ప, మైనార్టీనాయకులు సైకిల్‌షాపుబాబా, మౌలాసాబ్‌, తెలుగుయువతనాయకులు కిశోర్‌,  చికెనసెంటర్‌ నాగేంద్ర, సీబీఎనఆర్మీమండల అధ్యక్షుడు శీన పాల్గొన్నారు.


బుక్కపట్నం:  రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడానికి నిరసనగా మండలకేంద్రంలోని టీడీపీ శ్రేణులు  స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు మాట్లాడుతూ  ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం సరైందికాదన్నారు. రాష్ట్రంలో పర్యటించే హక్కు ప్రతిపక్ష నేతలకు లేదా అని ప్రశ్నించారు.  ఈ ప్రభుత్వాన్ని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.   కార్యక్రమంలో మాజీఎంపీపీ చింతకాయలరవి, మండల కన్వీనర్‌ చింతామలిరెడ్డి,  పట్టణకన్వీనర్‌ జంగం వెంకటరాముడు, సీనియర్‌ నాయకులు బాలు, కాయగూరలచంద్ర, శ్రీరాములు,  గొర్లకృష్ణ, సామకోటి ఈశ్వరయ్య, దేశెట్టిరామాంజి, ప్రకాశ, మైనార్టీ నాయకులుస్టూడియో ఫకృద్దీన, వాజీద్‌, రఫీ,లెజెండ్‌, బాషా, తెలుగుయువతనాయకులు ఈడిగ కృష్ణ, మంజు,సుధీర్‌, మక్కిశెట్టి శీన పాల్గొన్నారు


ఓబుళదేవరచెరువు: చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రేణిగుంట విమానాశ్రమానికి చేరుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డగించడాన్ని నిరసిస్తూ మండలకేంద్రంలోని టీడీపీ శ్రేణులు స్థానిక కదిరి - హిందూపురం ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా   పార్టీ మండల కార్యదర్శి శెట్టివారి జయచంద్ర,   కోఆప్షన మాజీ సభ్యుడు నిజాం మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్న   చంద్రబాబును పోలీసులు ద్వారా అడ్డుకుందన్నారు.   వైసీపీ  అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తర్వాత   ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అక్కడే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్‌ఎంపీ జాకీర్‌, గంగాద్రి, సౌదీనాగరాజు, పీట్ల సుధాకర్‌, బోనాల రామాంజి, బ్రహ్మానందరెడ్డి, కుమార్‌, సురేష్‌, మీసేవ సుధాకర్‌, సూరి, సంగాల శీన, మండోజీ ఆరీ్‌ఫఖాన, ఎస్సీసెల్‌ మండల ఉపాధ్యక్షుడు సునీల్‌కుమార్‌, రామారావు, రామాంజి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T07:33:00+05:30 IST