రాష్ట్రానికి రూ.939కోట్ల ఉపాధి నిధులు

ABN , First Publish Date - 2020-03-27T08:24:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు విడుదలయ్యాయి. 2019-20 సంవత్సరానికి సంబంధించి పై పద్దు కింద...

రాష్ట్రానికి రూ.939కోట్ల ఉపాధి నిధులు

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు విడుదలయ్యాయి. 2019-20 సంవత్సరానికి సంబంధించి పై పద్దు కింద రూ.939.25 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. ఉపాధి పథకం కింద ఈ ఏడాదిలో సుమారు రూ.6,400 కోట్లు పనులు చేపట్టారు. అందులో సుమారు రూ.4 వేల కోట్లు వేతనాల కింద నేరుగా కూలీల ఖాతాలకు జమకానున్నాయి.


మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద సుమారు రూ.2700 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉన్నా ఇప్పటి వరకూ కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధులతో మెటీరియల్‌ బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముందు పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు తిలోదకాలిచ్చింది.  కేంద్రం నిధులు విడుదల చేసినందున రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పథకం కింద గత ఏడాది పూర్తి చేసిన పనులకు చెల్లింపులు చేయాలని ఉపాధి పథకం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వీరంకి గురుమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2020-03-27T08:24:12+05:30 IST