గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-10-19T04:54:17+05:30 IST

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాభివృద్ధిలో వార్డు మెంబర్లు కీలకపాత్ర పోషించాలని గ్రామీ ణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్‌ జె.మురళీ అన్నారు.

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
వార్డు మెంబర్ల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న జె.మురళీ

పెనగలూరు, అక్టోబరు 18: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాభివృద్ధిలో వార్డు మెంబర్లు కీలకపాత్ర పోషించాలని గ్రామీ ణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్‌ జె.మురళీ అన్నారు. సోమవారం ఎంపీడీవో వరప్రసా ద్‌ అధ్యక్షతన మండల పరిషత్‌ సభాభవనం, స్త్రీశక్తి భవనంలో వేర్వేరుగా జరిగిన వార్డు మెంబర్ల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపసర్పంచ్‌లు, వార్డు మెం బర్లు పాతకాల విధానానికి స్వస్తి పలికి తమ వార్డు పరిధిలోని ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసినప్పుడే గ్రామ పరిధిలో మంచి పేరు తెచ్చుకుంటారన్నారు. ఈ సందర్భంగా పలువురు మెంబర్లు వీధులలో నిర్మించిన సిమెంటు రోడ్లకిరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధాకర్‌ రెడ్డి, డీఎల్‌పీవో నాగరాజు, ఈవోపీఆర్‌డీ పద్మభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-19T04:54:17+05:30 IST