శరవేగంగా రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2020-10-01T09:24:26+05:30 IST

రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్‌వన్‌గా తిర్చిదిద్దాడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా

శరవేగంగా రాష్ట్రాభివృద్ధి

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

పోచారంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం


ఘట్‌కేసర్‌ : రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్‌వన్‌గా తిర్చిదిద్దాడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.2.63 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అబివృద్ధిపథంలో నడిపేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో భూసమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టి భూముల వివరాలను పొందుపర్చే పనికి శ్రీకారం చుట్టిందన్నారు. గత 60ఏళ్లలో జరగని అబివృద్ధిని కేవలం ఆరేళ్లలో చేసి చూపిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలుచోట్ల మొక్కలు నాటారు.


ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నానావత్‌ రెడ్యానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, మేనేజర్‌ నర్సింహులు, ఏఈ నరే్‌షకుమార్‌, కౌన్సిలర్లు గొంగళ్ల మహేష్‌, సీహెచ్‌ రాజశేఖర్‌, ఎస్‌ సాయిరెడ్డి, ఆకిటి శైలజ, మెట్టు బాల్‌రెడ్డి, బెజ్జంకి హరిప్రసాదరావు, బాలగోని వెంకటేష్‌, సుర్వి రవీందర్‌, సుదాలక్ష్మి, ఎ సరిత, నల్లవెల్లి లక్ష్మి, ఎం.పోచమ్మ, శ్రీలత, నాయకులు మందడి సురేందర్‌రెడ్డి, గొంగళ్ల బాలేష్‌, బద్దం జగన్‌మోహన్‌రెడ్డి, చిన్న నర్సింహగౌడ్‌ బాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, శేఖర్‌, అయిలయ్య, యూసుఫ్‌, పల్లె భిక్షపతి, కేఎంరెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T09:24:26+05:30 IST