నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు

ABN , First Publish Date - 2020-11-01T10:26:12+05:30 IST

నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు

నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు

ఆనంద గజపతి ఆడిటోరియం ముస్తాబు

కొవిడ్‌ నిబంధనలతో ఏర్పాట్లు

పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆనంద గజపతిరాజు ఆడిటోరియం ముస్తాబైంది. ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం ఏర్పాట్లను ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ కిషోర్‌కుమార్‌ పరిశీలించారు. వేడుకలకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు ప్రారంభిస్తారని జేసీ తెలిపారు.  కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడిటోరియంలో శానిటైజ్‌ చేశారు. భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటుచేశారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ జె వెంకట్రావు, ఆర్డీవోలు గణపతిరావు, భవానీశంకర్‌, కమిషనర్‌ వర్మ, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, పద్మావతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T10:26:12+05:30 IST