ఇంజనీరింగ్‌ ఫీజులపై రాష్ట్ర కమిటీ నిర్ణయమే కీలకం..!

ABN , First Publish Date - 2022-05-20T17:09:26+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజుల విషయంలో తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) తీసుకోబోయే నిర్ణయమే కీలకం కానుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..

ఇంజనీరింగ్‌ ఫీజులపై రాష్ట్ర కమిటీ నిర్ణయమే కీలకం..!

కేంద్ర కమిటీ ఫీజులను అమలుచేయాల్సిన అవసరం లేదు

స్పష్టం చేస్తున్న అధికారులు

ఫీజులపై త్వరలోనే టీఏఎ్‌ఫఆర్‌సీ నిర్ణయం

కనీసం 50శాతం పెంచాలని  కాలేజీల ప్రతిపాదనలు


హైదరాబాద్‌,  (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజుల విషయంలో తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) తీసుకోబోయే నిర్ణయమే కీలకం కానుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేయడానికి బీఎన్‌ శ్రీకృష్ణ అధ్యక్షతన కేంద్రం నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ కనీస ఫీజును రూ.79,600గా, గరిష్ఠ ఫీజును రూ.1.89 లక్షలుగా ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఇదే విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అధికారులు అన్ని రాష్ట్రాలకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమోదించిన ఫీజులు అమల్లోకి వస్తాయా? లేక రాష్ట్ర స్థాయి లో టీఏఎ్‌ఫఆర్‌సీ ఖరారుచేసిన ఫీజులు వర్తిస్తాయా? అ నే విషయంపై కొంత చర్చ జరుగుతోంది. 


అయితే ఆయా రాష్ట్రాలే తమ పరిధిలోని కాలేజీల ఫీజులను ఖరారు చేస్తాయని అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఎ్‌ఫఆర్‌సీ త్వరలోనే ఫీజులను ఖరారు చేస్తుందని పేర్కొంటున్నారు. కా గా, 2019-22 నుంచి మూడేళ్ల కాలానికి ఖరారు చేసిన ఫీ జుల గడువు ముగిసింది. తిరిగి 2022-23 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులను నిర్థారించాల్సి ఉంది. ఇప్పు డు ఖరారు చేసే ఫీజులు 2024-25 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉంటాయి. ఇంజనీరింగ్‌తోపాటు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బి.ఎడ్‌ వంటి అన్ని రకాల వృత్తి వి ద్యా కోర్సులకు ఫీజులను నిర్ణయించనున్నారు. దీనికోసం టీఏఎఫ్‌ఆర్‌సీ ఇప్పటికే నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  ఆయా కాలేజీల నుంచి ప్రతిపాదనలను కూడా తీసుకుం ది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులు కనిష్ఠంగా రూ. 30వేలు ఉండగా, గరిష్ఠ ఫీజు రూ.1.34 లక్షల వరకు ఉంది. అయితే... ప్రస్తుతం ఉన్న ఫీజులను కనీసం 50 శాతం పెంచాలని ఆయా కాలేజీలు ఏఎ్‌ఫఆర్‌సీకి ప్రతిపాదించినట్టు తెలిసింది. సాధారణంగా ఈ ఫీజులను ఆ యా కాలేజీల్లో సదుపాయాలు, పలు ఇతర అంశాలను బట్టి ఖరారు చేస్తారు. ఇప్పటికే ఆయా కాలేజీలు తమ ఆదాయం, వ్యయంతోపాటు సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాల ఆడిట్‌ వివరాలను కమిటీకి సమర్పించాయి. వివరాలను ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. రోజూ కొన్ని కాలేజీల ప్రతినిధులను పిలిపించి ఆడిట్‌ వివరాలపై చర్చిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కమిటీ  ఫీజులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2022-05-20T17:09:26+05:30 IST