26న రాష్ట్ర కేబినెట్‌ భేటీ

ABN , First Publish Date - 2020-02-22T09:30:53+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 26వ తేదీన జరగనుంది. ఈ నెల 12న (రెండో బుధవారం) సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది.

26న రాష్ట్ర కేబినెట్‌ భేటీ

అమరావతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 26వ తేదీన జరగనుంది. ఈ నెల 12న (రెండో బుధవారం) సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు అభ్యర్ధులెవరైనా పాల్పడితే.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాతా అనర్హుడిగా ప్రకటించేలా ఆర్డినెన్సు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్సు కూడా ఇచ్చారు. స్థానిక ఎన్నికల తర్వాతే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిద్దామని మంత్రులకు సీఎం ఆ సందర్భంగా చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ.. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉండడంతో.. 26న జరిగే కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-02-22T09:30:53+05:30 IST