Advertisement
Advertisement
Abn logo
Advertisement

10 నుంచి రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

రాజాం రూరల్‌: రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు స్థానిక తృప్తి రిసార్ట్స్‌లో ఈనెల 10 నుంచి 12 వరకు  నిర్వహిం చనున్నట్టు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కోత పూర్ణ చంద్రరావు, ప్రధాన కార్యదర్శి పీవీజీ కృష్ణంరాజు (మురళీ మాస్టర్‌) తెలిపారు. ఆదివారం వారు పోటీలకు  సంబంధించిన వివరాలను వెల్లడించారు. సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు, బాలిక లు 26 జట్లు 560 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. స్పోర్ట్స్‌ అథారటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అనుమతితో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాల్‌ బాడ్మింటన్‌ అసోసియేషన్లు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయన్నారు.


జాతీయస్థాయి పోటీలు ఇక్కడే..

సబ్‌ జూనియర్స్‌కు సంబంధించి జాతీయస్థాయి పోటీలు వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 12 వ తేదీ వరకు తృప్తి రిసార్ట్స్‌లోను, జూనియర్స్‌కు సంబంధించి జనవరి 27 నుంచి 31వ వరకు బీహార్‌లో నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. సమావేశంలో సంఘ సభ్యులు బీహెచ్‌ అరుణ్‌కుమార్‌, టి.శ్రీనివాసరావు, జి.సుందర్రావు, కెప్టెన్‌ డీఎల్‌ఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement