Startup Owner from Bengaluru: పెళ్లి చూపులు చూడమంటే పనిచూపులు చూసిన కూతురు.. తండ్రికి ఈ విషయం తెలిసి..

ABN , First Publish Date - 2022-05-03T00:57:14+05:30 IST

ఏదైనా ఒక సంస్థ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలంటే ఏం చేస్తుంది. ఇదేం ప్రశ్న.. దిన పత్రికల్లో ఉద్యోగ ప్రకటన ఇవ్వడం ద్వారానో..

Startup Owner from Bengaluru: పెళ్లి చూపులు చూడమంటే పనిచూపులు చూసిన కూతురు.. తండ్రికి ఈ విషయం తెలిసి..

ఏదైనా ఒక సంస్థ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలంటే ఏం చేస్తుంది. ఇదేం ప్రశ్న.. దిన పత్రికల్లో ఉద్యోగ ప్రకటన ఇవ్వడం ద్వారానో లేక జాబ్ సైట్స్‌లో యాడ్స్ ఇవ్వడం ద్వారానో తమకు తగిన వ్యక్తిని దరఖాస్తు చేసుకోమని అవకాశం ఇస్తుంది. ఇంటర్వ్యూలు చేసి అర్హులైన వారిని ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటుంది అంటారా. కానీ.. ఈ Startup Owner రూటే సపరేటు. Bengaluru నగరంలోని ఓ స్టార్టప్ సంస్థ యజమాని అయిన యువతి ఉద్యోగిని నియమించుకునేందుకు మ్యాట్రిమోనియల్ సంస్థను వాడుకుంది. ఆ యువతి పేరు Udita Pal. బెంగళూరుకు చెందిన Salt.Pe అనే స్టార్టప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు. ఆ యువతి తండ్రి ఆమె ప్రొఫైల్‌ను ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌‌లో అప్‌లోడ్ చేశాడు.


ఓ యువకుడు ఆమె ప్రొఫైల్ పట్ల ఆసక్తి చూపడంతో అతని ప్రొఫైల్‌ను ఆమె తండ్రి ఉదితా పాల్‌‌కు పంపాడు. అయితే.. ఆమె ఆ యువకుడితో పెళ్లి చూపులకు బదులు పని చూపులు పెట్టుకుంది. ఆ యువకుడిని తన స్టార్టప్ కోసం పనిచేసేందుకు ఉద్యోగిగా నియమించుకునే ప్రయత్నం చేసింది. సదరు యువకుడు ఆమె చేసిన ఈ పని గురించి ఆమె తండ్రికి చెప్పాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న తండ్రి ఆమె కూతురికి క్లాస్ తీసుకున్నాడు. వాట్సాప్‌లో తండ్రీకూతురు మధ్య జరిగిన ఆ సంభాషణను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ స్క్రీన్‌షాట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ తండ్రి క్లాస్ తీసుకున్న సంభాషణ తెలుగులో యథాతథంగా...


తండ్రి: మనం ఇప్పుడు మాట్లాడుకుందామా? అర్జెంట్


తండ్రి: నువ్వేం చేశావో నీకైనా తెలుస్తుందా


తండ్రి: మ్యాట్రిమోనియల్ సైట్స్ నుంచి నువ్వు ఉద్యోగులను ఎంపిక చేసుకోకూడదు


తండ్రి: ఆ అబ్బాయి తండ్రికి నన్నేం చెప్పమంటావ్


తండ్రి: నేనిప్పుడే నీ మెసేజ్ చదివాను. అతనికి నువ్వు ఇంటర్వ్యూ లింక్ పంపి రెజ్యూమ్ పంపించమని అడిగావ్. రిప్లై ఇవ్వు పిచ్చి తల్లీ


కూతురు: హేహే


కూతురు: ఫైన్‌టెక్ ఏడేళ్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న గొప్ప సంస్థ. ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉన్నాం


కూతురు: ఐ యామ్ సారీ


ఇదీ ఆ తండ్రీకూతురి మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణను Udita Pal స్క్రీన్‌‌షాట్ తీసి ట్విట్టర్‌‌‌లో పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్‌‌ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సదరు మ్యాట్రిమొనీ వెబ్‌సైట్ కూడా ఈ ఘటనపై చమత్కారంగా స్పందించింది. ‘ఇప్పటికీ మీ సంస్థలో ఓపెనింగ్స్ ఉంటే మాకు తెలియజేయండి. ఒక సరైన జీవిత భాగస్వామి కోసం దరఖాస్తు చేసుకుంటాం’ అని ఆ మ్యాట్రిమొనీ సంస్థ Udita Palకు ట్వీట్ చేసింది.


ఇక.. Udita Pal చేసిన మరో ట్వీట్ ఏంటంటే.. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక Updated News పంచుకుంటున్నానని ఆమె చెప్పింది. ఆ పెళ్లి కొడుకు సంవత్సరానికి రూ.62 లక్షల శాలరీ కావాలని అడిగాడని, తన కంపెనీ అంత ఇచ్చుకోలేదని ట్వీట్ చేసింది. ఈ ఘటన తర్వాత మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన ప్రొఫైల్ డిలీట్ చేశారని Udita Pal తన ట్వీట్‌లో పేర్కొంది. ఈతరం అమ్మాయికి, ఆ తరం తండ్రికి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా భిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు తావిచ్చింది.

Read more