Abn logo
Feb 19 2020 @ 23:15PM

మేలో మొదలు... ఏప్రిల్‌లో విడుదల!

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఒక చిత్రాన్ని రూపొందించనున్నాయి. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మాతలు. ఈ ఏడాది మేలో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌, హారిక అండ్‌ హాసిని కలయికలో ‘అరవింద సమేత వీరరాఘవ’ విజయం తర్వాత రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రనిర్మాణంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ భాగస్వామి అయింది. మిగతా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత వెల్లడించనున్నారు. హీరోగా ఎన్టీఆర్‌ 30వ చిత్రమిది.


Advertisement
Advertisement
Advertisement