Jul 7 2021 @ 00:54AM

ఫైట్‌తో ప్రారంభం

శివ జొన్నలగడ్డ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘దమ్మున్నోడు’. దుమ్ము దులుపుతాడు ట్యాగ్‌లైన్‌. మంగళవారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. నిర్మాత ప్రసన్న కుమార్‌ తొలి సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. తుమ్మలపల్లి నారాయణ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ‘‘పవర్‌ఫుల్‌ స్టోరీ, భారీ ఫైట్స్‌, సాంగ్స్‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఫైట్‌తో చిత్రీకరణ ప్రారంభించాం. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని హీరో చెప్పారు. ‘‘దమ్మునోడు’ కథ, టైటిల్‌ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నాను. ఏడు భారీ ఫైట్స్‌ను ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అని నిర్మాతలు బాలాజీ కొండేకర్‌, రేణుక కొండేకర్‌ తెలిపారు. ప్రియాంశ్‌, గీతాంజలి, స్వప్న కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎల్‌.ఎమ్‌. ప్రేమ్‌ సంగీతం అందిస్తున్నారు.