కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

ABN , First Publish Date - 2022-01-29T05:47:43+05:30 IST

ఈరోజు నుంచే కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది, రాత్రింబవళ్లు పని చేయించి చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను త్వరలో పూర్తి చేసి ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా సాగునీరు అందించాలని సీఎం కా ర్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఇరిగేషన్‌ అధికారు లను ఆదేశించారు.

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో వాగ్వాదం చేస్తున్న చిన్నోనిపల్లి గ్రామస్థులు

- రాత్రింబవళ్లు పని చేయించండి

- నాలుగు రోజుల్లో భూ సేకరణకు నోటిఫికేషన్‌

- ఆర్డీఎస్‌ లింక్‌కెనాల్‌ పూర్తిచేసి నీరందించాలి

- చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌

- ఇరిగేషన్‌ అధికారుల తీరుపై అగ్రహం

గద్వాల , గట్టు జనవరి 28: ఈరోజు నుంచే కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది,  రాత్రింబవళ్లు పని చేయించి చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను త్వరలో పూర్తి చేసి ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా సాగునీరు అందించాలని సీఎం కా ర్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఇరిగేషన్‌ అధికారు లను ఆదేశించారు. ఆమె శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్‌ లో  ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఈఎన్‌సీ మురళీ ధర్‌రావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాంలతో కలిసి గట్టు మండలంలోని చిన్నోనిపల్లికి చేరుకొని రిజ ర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్‌ వద్దనే సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ అధికా రులు మాట్లాడుతూ దాదాపు 85శాతం పనులు పూర్తి చేశా మని, మధ్యలో కాంట్రాక్టర్‌ వదిలివే యడంతో పనులు నిలిచిపోయాయని వివరించారు. దాదాపు 54 వేల క్యూబిక్‌ మీటర్ల పనులు ఉన్నాయని, ఫీడర్‌ చాన ల్‌తో పాటు మరికొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అనంతరం ఇరిగేషన్‌ అధికారులకు పనుల పూర్తిపై ప్లానింగ్‌ ఇచ్చారు. మిగిలిపోయిన 54వేల క్యూబిక్‌ మీటర్ల కట్ట పనులను ప్రతీ రోజు 4వేల క్యూబిక్‌ మీటర్ల చొప్పున రాత్రింబవళ్లు పనులు చే యించి పూర్తి చేయాలని సూచించారు. రిజర్వాయర్‌కు నిర్మించాల్సిన 1.7 కిలోమీటర్ల ఫీడర్‌ కెనాల్‌కు, వయా టీటీదొడ్డి నుంచి ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌ వరకు 9కిలో మీ టర్ల కాలువ నిర్మాణానికి భూసేకరణకు నాలుగు రోజు ల్లో నోటిఫికేషన్‌ ఇవ్వాలని, భూసేకరణను పూర్తి చేసే బాధ్యతను అదనపు కలెక్టర్‌ శ్రీహర్షకు అప్పగించారు. అదే సందర్భంలో కాలువల నిర్మాణానికి టెండర్లను వి భాగాలుగా విభజించి వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు పూర్తి చేయాలని సూచించారు. చిన్నోనిపల్లి గ్రా మం తరలింపు నకు ఆర్‌ఆర్‌ సెంటర్‌లో మౌలిక వసతు లు కల్పించి వారిని ఖాళీ చేయించాలని అక్కడ ఏదైన సమస్య ఉంటే ఎమ్మెల్యే సహకారం తీసుకోవాలని వివ రించారు. ఇరిగేషన్‌ పనులు నిలిచిపోవడానికి ప్రధాన సమస్య ఆర్‌ఆర్‌ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించ డంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి సీఎంవో కార్యదర్శి, మంత్రికి వివరించారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ వద్ద సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సాగు నీటిని సద్వినియోగం చేసుకునే నాయకుడు  కేసీఆర్‌ మాత్రమే అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరును సస్యశ్యామ లం చేస్తామని తెలిపారు. అనంతరం ఎంపీపీ విజ య్‌కుమార్‌, జడ్పీటీసీ బాసు శ్యామల, ధరూర్‌ వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డిలతో పాటు పలువురు వినతి పత్రాలను అందించారు.

మా గ్రామాన్ని ముంచొద్దు

గట్టు : జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పనుల పరిశీలనకు వచ్చిన సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు చిన్నోనిపల్లి ముంపు గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు తమ కష్టాలు చెప్పుకుందామని గ్రామస్థులు  వినతి పత్రాలతో వేచి ఉన్నారు. కానీ ఆమె ముంపు గ్రామస్థుల మొర ఆలకించకపోగా కనీసం వినతి కూడా స్వీకరించకపోవడంతో వారు ఆగ్రహించారు. సీఎం కార్యాలయ కార్యదర్శి నిర్వహిస్తున్న సమీక్ష వద్దకు  చేరుకొని నినాదాలు చేశారు. టెంటులోపలికి చొచ్చుకువచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రజలు కేకలు వేయడంతో అ ప్రాంతం అంతా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాట వినకుండా అందోళన చేశారు. ఎమ్మెల్యేతో పాటు, మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డితో గ్రామస్థులు వాగ్వా దానికి దిగారు. ఎన్నికల సమయంలో తమకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధను అర్థం చేసుకోవ డం లేదని మండి పడ్డారు.  






Updated Date - 2022-01-29T05:47:43+05:30 IST