సున్నా వడ్డీ పథకం ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-21T05:35:00+05:30 IST

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు.

సున్నా వడ్డీ పథకం ప్రారంభం

 జిల్లాలో 60,243 మంది రైతులు అర్హులు

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 20:
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం 2019-2020 రబీ పంట కాలానికి రూ.లక్షలోపు బ్యాంకు పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేశారు. కలెక్టరేట్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పథకం 60,243 మంది రైతుల ఖాతాలకు రూ.6,39,97,145 జమ అయిందన్నారు. మెగా చెక్కును కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్‌, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ భరత్‌ కుమార్‌ అందజేశారు. కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ డీడీ ఉమాదేవి, సెరికల్చర్‌ డీడీ పరమేశ్వరి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:35:00+05:30 IST