సాగు షురూ!

ABN , First Publish Date - 2021-06-13T05:08:48+05:30 IST

జిల్లాలో వానాకాలం సాగు మొదలైం ది. సీజన్‌ ఆరంభంలోనే వర్షాలు కురుస్తుండ డంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. సోయా విత్తనాలు దొరకపోవడంతో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు.

సాగు షురూ!

జిల్లాలో ప్రారంభమైన వానాకాలం సాగు
పసుపు, సోయా, మొక్కజొన్న వైపు మొగ్గు
వరి సాగుకు నారుమళ్లు సిద్ధం
మొదలు కాని పంట రుణాల పంపిణీ

నిజామాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వానాకాలం సాగు మొదలైం ది. సీజన్‌ ఆరంభంలోనే వర్షాలు కురుస్తుండ డంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. సోయా విత్తనాలు దొరకపోవడంతో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత ధర పెరగడంతో ఎక్కు వ మంది రైతులు ఈ యేడాది పసుపు సాగుకు మొగ్గు చూపుతున్నారు. వర్ని, రుద్రూరు మండలాల పరిధిలో వరి నాట్లు వేస్తుండగా ఇతర మండలాల్లో నారు మళ్లను సిద్ధం చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాల పంపిణీ లేకపోవడంతో రైతు లు ప్రైవేటులో కొనుగోలు చేసి విత్తనాలు వేస్తున్నారు.
జూన్‌ ఒకటో తేదీ నుంచి 79.8 మి.మీ. వర్షం
జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరు తి ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా లేకున్నా అల్పపీడ న ప్రభావంతో అన్ని మండలాల పరిధిలో వర్షాలు కురుస్తు న్నాయి. జిల్లాలో జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 42.4 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 79.8 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలోని 29 మండలాల్లో ఆరిం ట్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 23 మండలాల్లో సాధారణానికి మించి నమోదైంది. మరో నాలుగు రోజులు ప్రతీ రోజు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వా తావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రస్తుత వర్షాలు, భూగర్భజలాల లభ్యత ను బట్టి ప్రణాళికను తయారు చేశారు. ఈ వానాకాలంలో 5 లక్షల 6 వేల ఎకరాలలో పంటలు సాగవుతా యని అంచ నా వేశారు. వరి 3 లక్షల 86 వేల ఎకరాల వరకు సాగవుతు ందని అంచనా వేశారు. మిగతా లక్షా ఇరవై వేల ఎకరాలలో మొక్కజొన్న, సోయా, పసుపు, కంది, పెసర, ఇతర పంటలు సాగవుతాయని తెలిపారు.
మొదలైన ఆరుతడి పంటల సాగు
జిల్లాలో ఆరుతడి పంటలకు అనుకూలంగా వర్షాలు కు రుస్తుండడంతో రైతులు సాగు మొదలు పెట్టారు. వర్షాలు అనుకూలంగా పడుతుండడంతో విత్తనాలు వేస్తున్నారు. ప సుపు, సోయా, మొక్కజొన్న, కంది పంటలు వేస్తున్నారు. గత వానాకాలానికి భిన్నంగా ఈ యేడాది ఎక్కువ మంది మొక్కజొన్న వైపు మొగ్గుచూపుతున్నారు. సబ్సిడీ సోయా వి త్తనాలు లేకపోవడం.. ప్రైవేటులో అనుకూలమైన విత్తనాలు దొరకపోవడంతో ఎక్కువ మంది ఖర్చు తక్కువగా ఉండే మొక్కజొన్న వేస్తున్నారు. పసుపులోనూ అంతర పంటగా సాగు చేస్తున్నారు. సోయా దొరికిన వారు మాత్రం విత్తనా లు వేస్తున్నారు. గత సంవత్సరంలాగా కంపెనీ విత్తనాలు రాకపోవడంతో ప్రైవేటులో ఇచ్చే వాటితో పాటు మహారాష్ట్ర కు వెళ్లి తీసుకువచ్చి వేస్తున్నారు. కందిని సోయాలో అంతర పంటగా కూడా వేస్తున్నారు.
పసుపు వైపే ఎక్కువ మంది రైతుల మొగ్గు
పసుపునకు ధర పెరగడంతో జిల్లాలో ఎక్కువ మంది రై తులు మళ్లీ పసుపు సాగువైపు మొగ్గుచూపుతున్నారు. గత సంవత్సరం కన్నా ఎక్కువగా సాగు చేస్తున్నారు. గడిచిన ఏడాది క్వింటాలు పసుపు రూ.10వేల వరకు ధర పలికింది. సరాసరి రూ.6వేల నుంచి రూ.7వేల మధ్య అమ్మకాలు జరి గాయి. మొత్తమ్మీద రకాన్ని బట్టి పసుపునకు క్వింటాలుకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు రేటు పెరగడంతో ఈ సంవత్సరం కూడా ధర ఉం టుందని రైతులు బావిస్తున్నారు. విత్త నం ముందే సిద్ధం చేసుకొని ఇప్పుడు వేస్తున్నారు. ధర ఉండడం వల్ల గత సంవత్సరం కన్నా ఈ వానాకాలంలో పది వేల ఎకరాలు ఎక్కువగా పసుపు సాగవు తుందని వ్యవసాయశాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. రైతులు మాత్రం ధర ఆశించిన స్థాయిలో ఉండడం వల్ల సాగు పెంచుతున్నట్లు తెలిపారు.
గణనీయంగా పెరగనున్న వరి సాగు
జిల్లాలో ఈసారి వరి సాగు గణనీయంగా పెరగనుంది. శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌లతో పాటు చెరువులలో, భూగ ర్భజలాలు సమృద్ధిగా ఉండడంతో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు కానుంది. ఇప్పటికే రైతులు నారుమళ్లను సిద్ధం చేస్తు న్నారు. వర్ని మండలంలో రైతులు నాట్లు కూడా వేస్తున్నా రు. గత యేడాది వానాకాలంతో పోల్చితే ఈ సంవత్సరం ఇ రవై వేల ఎకరాలు పెరగుతుందని వ్యవసాయశాఖ అధికా రులు అంచనా వేశారు. అలాగే, ఈసారి వరి ధాన్యానికి కేం ద్ర ప్రభుత్వం మద్దతు ధరను రూ.72లు పెంచింది. కేంద్రం పెంచిన మద్దతు ధరతో క్వింటాలు ఏ గ్రేడ్‌ ధాన్యం ధర రూ.1,960లు, బీ గ్రేడ్‌ రూ.1,940లు అయింది. గడిచిన రెండే ళ్లుగా నీరు అందుబాటులో ఉండటం, దిగుబడి పెరగడం, పండించిన ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడం తో ఎక్కువ మంది రైతులు వరి సాగుకు మళ్లారు. రైతులు మాత్రం ఈ వానాకాలంలో వరితో పాటు తమకు అనుకూ లమైన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
పంట రుణాల పంపిణీ అంతంతే!
జిల్లాలో వానాకాలం సాగు పనులు మొదలైనప్పటికీ బ్యాంకర్లు పంట రుణా లు మాత్రం ఆశించి న స్థాయిలో ఇవ్వ డం లేదు. ఇప్పటికీ వానాకాలం రుణ ప్రణాళికను ఖరారు చే యకపోవ డం వల్ల బ్యాంకు ల వారీగా లక్ష్యా లను నిర్ణయించ లేదు. రుణాలను మంజూరు చేయడం లేదు. కొన్ని బ్యాంకుల పరిధిలో అధికారులు తెలి సిన రైతులకు ఇస్తున్నా.. ఇతర రైతులకు మాత్రం అందడం లేదు. అవసరం ఉన్న రైతులు మాత్రం తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుంటున్నారు. సీజన్‌ మొదలు అయినందున రుణాలు  అందిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని అన్నదాతలు భావిస్తున్నారు.
ఈ యేడు పసుపు సాగు పెంచాం..
- అర్గుల శ్రీనివాస్‌, వన్నెల్‌(బి) బాల్కొండ

నాకు పదెకరాల భూమి ఉంది. గతేడాది జొన్న, మొక్కజొన్న, పసుపు, సోయా, వరి పంటలను సాగు చేశాను. పసుపునకు ఈ యేడాది కూడా ధర ఉంటుందనే న మ్మకంతో నాలుగున్నర ఎకరాలు వేస్తున్నా. మొక్కజొన్న రెండెకరాలు, సోయా రెండె కరాలలో వేశాను. వరి ఎకరంన్నర వేస్తా. పెట్టుబడి ఎక్కువైనా తప్పడం లేదు.
ఎడ్లు లేకున్నా ట్రాక్టర్‌తో విత్తనాలు వేశా..
- రాజేందర్‌, వన్నెల్‌(బి) బాల్కొండ

వర్షాలు కురుస్తుండడంతో ఎడ్లు దొరకకున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాక్టర్‌తో దున్ని పసుపు వేశాను. ఇతర విత్తనాలు వేస్తున్నాం. సమయం మించిపోతే పంట రా దు. జూన్‌లో విత్తనం వేస్తే పంట త్వరగా చేతికి వస్తుంది. యాసంగి పంటలు కూడా అక్టోబరు, నవంబరు నెలలో వేయవచ్చు. పెట్టుబడి, కూలి ఎక్కువైనా తప్పడం లేదు.
వర్షాలను బట్టి పంటలు వేయాలి..
- మేకల గోవింద్‌, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో వర్షాలను బట్టి పంటలు వేయాలి. భారీ వర్షాలు కురిసిన తర్వాత పంట వేస్తే విత్తనం త్వరగా మొలుస్తుంది. దిగుబడి, గిట్టుబాటుకు అనుగుణంగా ఆరుతడి పంటలు వేయాలి. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం.

Updated Date - 2021-06-13T05:08:48+05:30 IST