మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-30T10:35:22+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో రైతుల విజ్ఞప్తి మేరకు మొక్కజొన్న కొనుగో ళ్లు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌తో పాటు వేల్పూర్‌ వ్యవసా య..

మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం

నిజామాబాద్‌, వేల్పూర్‌ వ్యవసాయ మార్కెట్‌లలో ప్రారంభం

క్వింటాలు రూ.1,850లకు కొనుగోలు


నిజామాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలో రైతుల విజ్ఞప్తి మేరకు మొక్కజొన్న కొనుగో ళ్లు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌తో పాటు వేల్పూర్‌ వ్యవసా య మార్కెట్‌ కమిటీలలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లను మొ దలుపెట్టారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద  ఉన్న మొక్కజొన్న నిల్వలకు ఆధారంగా మండల స్థాయిలో ఏర్పా టు చేసిన కమిటీ కూపన్‌లను జారీ చేస్తోంది. ఆ కూపన్‌ల ఆ ధారంగానే కొనుగోలు మొదలుపెట్టారు. జిల్లాలో ఈ వానాకాల ంలో 25 వేల ఎకరాలకుపైగా మొక్కజొన్న సాగుచేశారు. జిల్లా లో మొక్కజొన్నకు బదులుగా లాభసాటి పంటలను సాగుచేయాలని  ప్రభుత్వం కోరినా.. కొంత మంది రైతులు వేశారు. పంట చేతికి వచ్చిన సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్‌గా వ్యాపారుల కు అమ్మకాలు చేశారు.


క్వింటాలు రూ.వెయ్యి నుంచి రూ. 1,200 మధ్య విక్రయించారు. వర్షాలకు తడిసి మద్దతు ధ ర రాకపోవడంతో రైతులు ఆందోళన చేయడంతో ప్రభు త్వం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. మా ర్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనుగోలును గురువారం మొదలు పెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలు రూ.1,850కు కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న వేసిన గ్రామాల్లో అధికారులు సర్వే కొ నసాగిస్తున్నారు. మండల వ్యవసాయ, రెవెన్యూ సహాయకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి కలి సి రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలిస్తున్నా రు. ఇప్పటికే మెజారిటీ రైతులు అమ్మకాలు చే సినందున మొక్కజొన్న ఉన్న రైతులను గుర్తించడంతో పాటు వారి పంట భూములను పరిశీలిస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకంకు అ నుగుణంగా వారి భూమి ఆధారంగా నిల్వలను గుర్తించి వారికి కూపన్‌లను అందిస్తున్నారు. ఆ కూపన్‌ల ద్వారానే మొక్కజొన్నను వేల్పూర్‌, నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 60 శాతానికి పైగా అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించా రు.


వానాకాలంలో పంట విస్తీర్ణం ఆధారంగానే ప్రస్తుతం రైతుల వద్ద 20 వేల టన్నులకులోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలకు అను గుణంగా ఉన్న వాటిని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రైతులు ఈ రెండు మార్కెట్‌లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన అమ్మకాలు చేయాలని కోరారు. అవసరమైతే ఇతర మార్కెట్‌లలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల రోజుల ముందే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులందరికీ మేలు జరిగేది. ప్రస్తుతం తక్కువ ధరకు అమ్ముకున్న రైతుల కు నష్టమే మిగిల్చింది. మిగిలిన రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేయడం వల్ల నష్టం జరగని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2020-10-30T10:35:22+05:30 IST