సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించండి

ABN , First Publish Date - 2020-08-03T10:16:16+05:30 IST

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి కరోనా బాధితుల ప్రాణాలు కాపాడాలని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి డిమాండ్‌ చేశారు.

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించండి

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి శాంతి దీక్ష 


అనంతపురం వైద్యం, ఆగస్టు 2: సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి కరోనా బాధితుల ప్రాణాలు కాపాడాలని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. వెంటనే ఆసుపత్రిని ప్రారంభించి సేవలు అందించాలంటూ ఆదివారం ఆయన తన స్వగృహంలో శాంతి దీక్ష చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. ఆయన దీక్ష చేపడుతున్న ప్రదేశానికి పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ రూ.150 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని కరోనా విపత్తు సమయంలో వినియోగంలోకి తేలేకపోవడం బాధాకరం అన్నారు. 


టీడీపీ హయాంలోనే ఈ ఆస్పత్రి పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత దాన్ని అలాగే వదిలేయడంతో ప్రజలకు వైద్య సేవలు అందకుండా పోయాయన్నారు. చివరకు భవనాలు కూడా దెబ్బతింటున్నాయన్నారు. కరోనా ఉధృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వినియోగంలో ఉంటే బాధితులకు ఎంతో ఉపయోగకరం గా ఉండేదన్నారు. వైసీపీ పాలకులకు కనువిప్పు కలగాలనే దీక్ష చేపట్టినట్టు తెలిపారు. స్పందించకపోతే  ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. 


చౌదరికి మద్దతుగా సంఘీభావ దీక్షలు

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం ప్రభాకర్‌ చౌదరి చేపట్టిన దీక్షకు సంఘీభావంగా పలువురు శాంతి దీక్షలు చేపట్టారు.


టీడీపీ నగర అధ్యక్షుడు ఆదినారాయణ , జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రషీద్‌ అహ్మద్‌, టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జేఎల్‌ మురళీధర్‌, తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు విజయశ్రీ, నగర నాయకులు మారుతీగౌడుతో పాటు పలువురు నియోజకవర్గ నేతలు వారివారి ఇళ్ల వద్ద దీక్ష చేపట్టి సంఘీభావం తెలిపారు. అనంతరం టీడీపీ మహిళా నగర అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్‌ విజయశ్రీ  మాట్లాడుతూ.. జిల్లాకు తలమానికంగా నిర్మిం చిన సూ పర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌చేశారు. రూ.కోట్లు వెచ్చించి 90 శాతం నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ ఆసుప త్రిని అం దుబాటులోకి తీసుకురావడంలో వైసీపీ నిరంకుశంగా ప్రవర్తి

Updated Date - 2020-08-03T10:16:16+05:30 IST