Abn logo
Sep 21 2020 @ 22:10PM

స్టార్స్ ఇన్‌స్టాగ్రమ్‌ ముచ్చట్లివే..

Kaakateeya

నటీనటులు సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.


* బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తన అభిమాని తన కోసం చేసిన ఆర్ట్ వర్క్‌ను ప్రైజ్ చేశారు. నమ్మశక్యం కాని ఆర్ట్ వర్క్ అని చెబుతూ.. తనపై ఇంత ప్రేమ చూపుతున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 


* ప్రెగ్నెన్సీతో ఉన్న అనుష్క శర్మ వరల్డ్ గ్రాటిట్యూడ్‌ డే అని చెబుతూ.. ఎక్‌హర్ట్ టొల్లే, రామ్‌ దాస్‌ సూక్తులను పోస్ట్ చేశారు. బ్లాక్‌ డ్రస్‌లో సిమ్మింగ్‌ పూల్‌లో హాయిగా ఆమె ఎంజాయ్‌ చేస్తున్నారు.


* సీనియర్‌ నటి కాజోల్‌ చీర గురించి ప్రస్తావిస్తూ.. కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. నా చీరలను కట్టుకోవడం మిస్ అవుతున్నానని తెలుపుతూ.. శారీలో ఉండగా తన కూతురు తీసిన ఫొటోలతో మురిసిపోతున్నట్లుగా తెలిపారు.


* తను యోగా చేసుకుంటుండగా.. సౌండ్‌ వినిపించడంతో.. సౌండ్‌ ఆఫ్‌ స్ట్రెంత్‌ అని తెలుపుతూ.. తెలుగులో మాట్లాడారు నటి ప్రణీత. 'వామ్మో.. ఈ సౌండ్‌ ఎక్కడి నుంచి వచ్చిందో..?' అని అంటూ.. త్వరలోనే సమాధానం రానుందని అన్నారు.


* బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ తన తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇది వారికి 40వ పెళ్లిరోజుగా ఆయన పేర్కొన్నారు.


* స్టైల్‌ గురించి చెబుతూ మంచు లక్ష్మీ కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ఏం మాట్లాడకుండా కూడా మన శైలిని స్టైల్‌తో చెప్పవచ్చని ఆమె తెలిపారు. ప్రత్యేకమైన డ్రస్ వేసుకున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.Advertisement
Advertisement
Advertisement