Abn logo
Mar 8 2021 @ 08:06AM

కృతిశెట్టి కండీష‌న్స్‌.. షాకైన నిర్మాత‌?

కృతిశెట్టి.. హ్యాపెనింగ్ బ్యూటీ.క‌ర్ణాట‌క‌కు చెందిన ఈ అమ్మ‌డు తెలుగులో న‌టించిన ఉప్పెన‌తో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తొలి సినిమా సక్సెస్‌తో స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకున్న కృతి ఇప్పుడు నిర్మాతలకు కండీషన్స్ పెడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. వైష్ణ‌వ్ తేజ్‌, కృతిశెట్టి న‌టించిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వంద‌కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ మార్కును క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బేబ‌మ్మ‌గా న‌టించిన కృతిశెట్టి తెలుగు ఆడియెన్స్‌ను త‌న క్యూట్‌లుక్స్‌తో ఫిదా చేసేసింది. దీంతో నిర్మాత‌లు కృతిశెట్టిని త‌మ సినిమాలో న‌టింప చేస్తే బావుంటుంద‌ని క్యూ క‌ట్టారు. 

తొలి సినిమాకు ఆరు ల‌క్ష‌లు.. అక్క‌డి నుంచి వెంట‌నే అర‌వై ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న కృతిశెట్టి.. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అడుగుతుంద‌ట‌. రీసెంట్‌గా ఓ స్టార్ నిర్మాత త‌న సినిమాలో న‌టించాలంటూ కృతిశెట్టిని సంప్ర‌దించాడ‌ట‌. కృతిశెట్టి కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ట‌. సరే! అని నిర్మాత అనుకున్నాడ‌ట‌. అయితే కృతి శెట్టి పెట్టిన కండీష‌న్స్ విని షాక్ అయ్యాడ‌ట‌. అస‌లు కంటే కొస‌రెక్కువ అయ్యేలా ఉందే అనుకుని స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై కృతిశెట్టి ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement