Jul 9 2021 @ 23:25PM

స్టార్‌ లోకల్‌... షో ఇంటర్నేషనల్‌!

‘బిగ్‌ బ్రదర్‌’, ‘హూ వాంట్స్‌ టూ బి ఎ మిలియనీర్‌’ .... అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టీవీ షోలు. ‘బిగ్‌ బ్రదర్‌’ ‘బిగ్‌ బాస్‌’ పేరుతో రూపుదిద్దుకొని  ప్రాంతీయ భాషల్లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ షోగా గుర్తింపు పొందింది. ‘హూ వాంట్స్‌ టూ బి ఎ మిలియనీర్‌’ హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ)గా వచ్చి బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో తన సత్తా చాటింది. త్వరలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఇలాంటి  టీవీ షోల సక్సె్‌సకు వాటిలో ఉన్న కొత్తదనం ఒక కారణం అయితే, సినిమా తారలు హోస్ట్‌లుగా ఉండడమే అవి ఆడియన్స్‌కు ఎక్కువ రీచ్‌ అవడానికి మరో కారణం. హిందీలో సల్మాన్‌ఖాన్‌, తెలుగులో నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌, నాని, తమిళంలో కమల్‌హాసన్‌, మలయాళంలో మోహన్‌లాల్‌, కన్నడంలో సుదీప్‌ ‘బిగ్‌బా్‌స’ హోస్టులుగా ఆకట్టుకొన్నారు.


నాలుగు భాషల్లో... నలుగురు తారలతో...

సినిమాలు, సీరియళ్ల లాంటి రొటీన్‌ కార్యక్రమాలకు భిన ్నంగా, కొత్తదనం ఉండే ఇటువంటి కార్యక్రమాలంటే బుల్లితెర ప్రేక్షకులు కూడా ఆసక్తి  చూపుతున్నారు. అందుకే ఇప్పుడు పలు విదేశీ ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థలు ప్రాంతీయ భాషల్లో తమ టీవీ షోలను ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో చేరుతున్న షో ‘మాస్టర్‌ చెఫ్‌’. వరల్డ్‌ మోస్ట్‌ పాపులర్‌ కుకింగ్‌  రియాలిటీ షో. ఇది అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో  సూపర్‌ హిట్‌ అయింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ షోలో వంటకాలు చేస్తారు. అన్ని టాస్క్‌లు కంప్లీట్‌ చేసిన వారు ‘మాస్టర్‌ చెఫ్‌’  టైటిల్‌ గెలుచుకుంటారు.


2010లో మనదేశంలోకి అడుగు పెట్టిన ఈ షో ఇప్పటిదాకా హిందీలోనే వచ్చింది. ఇప్పుడు ‘మాస్టర్‌ చెఫ్‌’ పేరుతో ఓ తెలుగు టీవీ చానెల్లో రాబోతోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇటీవలె ‘నవంబర్‌ స్టోరీ’, ‘లెవన్త్‌ అవర్‌’ వెబ్‌సిరీ్‌సలతో ఆకట్టుకున్న కథానాయిక తమన్నా భాటియా ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. టీవీ షోకు హోస్ట్‌గా పనిచేయడం తమన్నాకు ఇదే తొలిసారి. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయ్‌ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడలో కిచ్చా సుదీప్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ షోను హోస్ట్‌ చేసే అవకాశం ఉంది. 


సర్వైవర్‌ ఎవరో?

విదేశాల్లో రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో ‘సర్వైవర్‌’. ఇది రొటీన్‌ షోలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో పాల్గొనేవారు మారుమూల ప్రాంతాల్లో ఏ సదుపాయాలు అందుబాటులో లేకుండా ఒంటరిగా జీవించాల్సి ఉంటుంది. 40 రోజుల పాటు మనుగడ కోసం వారు చేసే పోరాటం వీక్షకులను ఆకట్టుకోవడంతో ఈ షో సూపర్‌ సక్సెస్‌  అయింది. విజేతలకు పది లక్షల డాలర్ల ప్రైజ్‌ మనీ అందుతుంది. ఇప్పుడు ‘సర్వైవర్‌’ షోను దక్షిణాది ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.


ముందుగా తమిళంలో ఈ షోను లాంచ్‌ చేసి తర్వాత మిగిలిన భాషలకు విస్తరించాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారు. ప్రస్తుతం ‘సర్వైవర్‌’ షోకు హోస్ట్‌లుగా ఇద్దరు తమిళ నటుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. యువ హీరో శింబు ఈ షోకు హోస్ట్‌గా ఉంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయనతో సంప్రదింపులు ఫలించకపోవడంతో సీనియర్‌ నటుడు అర్జున్‌ సర్జా ఈ షోను హోస్ట్‌ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఈ షో చిత్రీకరణ ప్రారంభం కానుంది. అప్పుడే తమిళ ‘సర్వైవర్‌’ ఎవరనేది తెలుస్తుంది. 


రణ్‌వీర్‌ రెడీ

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ త్వరలోనే బుల్లితెరపైకి రానున్నారు. ఓ టీవీ చానెల్‌లో ప్రసారం కానున్న ‘ది బిగ్‌ పిక్చర్‌’ అనే కార్యక్రమం కోసం ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీని గురించి మాట్లాడుతూ ‘‘నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పుడు ఓ ఆసక్తికర క్విజ్‌ షో ద్వారా బుల్లితెరపైకి వస్తున్నాను’’ అని చెప్పారు. దీంతో పాటు బ్రిటిష్‌ సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలసి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ కోసం ఓ భారీ నాన్‌ఫిక్షన్‌ షోను రణ్‌వీర్‌ చేయబోతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో సైబీరియా ప్రాంతంలో ఈ షోను చిత్రీకరించనున్నారు. అక్కడ రణ్‌వీర్‌సింగ్‌ డేర్‌డెవిల్‌ స్టంట్స్‌ చేయనున్నారు.