Oct 28 2021 @ 16:45PM

స్విమ్‌సూట్‌లో ఫొటోను పెట్టిన సినీ నటుడి భార్య.. పొట్టేంటి అలా ఉందన్న నెటిజన్ల కామెంట్స్‌కు ఆమె రియాక్షన్ ఇదీ..!

సినీ నటులతో పాటు వారి భార్యలపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం షాహిద్ కపూర్ భార్య మీరా‌ రాజ్‌పుత్‌పై నెటిజన్లు సంచలన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లను మరచిపోకముందే  తాజాగా కరణ్ వీర్ బొహ్రా భార్య టీజే సిద్ధూ స్విమ్ సూట్ ధరించడంతో ఆమెను తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలింగ్ కామెంట్లకు ఆమె స్పందించింది.


కరణ్ వీర్ బొహ్రా భార్య టీజే సిద్ధూ కొన్ని రోజుల క్రితం స్విమ్ సూట్ ధరించి గోవాలోని ఒక రిసార్ట్‌లో ఫొటోలను తీసుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు ‘‘ నీ పొట్టేంటి ఇలా ఉంది. చూడటానికి అంత బాగా లేదు ’’ అని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు ఆమె స్పందించింది. ‘‘ నేను ఫొటోకు ఎలాంటి ఫిల్టర్లు జత చేయకుండా పోస్ట్ చేశాను. నా బాడీని  నేను దాచిపెట్టదలుచుకోలేదు. నాకు ఇలానే ఉండటం ఇష్టం. నాకు ఎటువంటి బరువు సమస్యలు లేవు. నన్ను బాధించే భాగాలు నా బాడీలో లేవు. నేను ప్రజలను ఆకట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. నాకు పిల్లలు కూడా ఉన్నారు. అందువల్ల నా పొట్టను తగ్గించుకోవడానికి కొంత సమయం కావాలి ’’ అని టీజే సిద్ధూ చెప్పింది.


‘‘ నేను గత 2 సంవత్సరాలుగా స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. నా బాడీ మీద మంచి అభిప్రాయం ఉన్నంత వరకు ఇటువంటి ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటాను ’’ అని టీజే సిద్ధూ వివరించింది. కరణ్ వీర్ బొహ్రా, టీజే సిద్ధూ దంపతులకు 3గురు పిల్లలు ఉన్నారు.


Bollywoodమరిన్ని...