Abn logo
Oct 17 2020 @ 22:33PM

5జి ఫోన్‌తో సందడి చేసిన ముద్దుగుమ్మలు

Kaakateeya

మార్కెట్‌లోకి కొత్తగా ఏదైనా వస్తుంది అంటే.. చాలు అంతకంటే ముందే సినీ తారల సందడి మొదలవుతుంది. తారలకు ఇదొక ఆదాయ వనరు అనే విషయం తెలిసిందే. మార్కెట్‌లోకి వస్తున్న ప్రొడక్ట్స్‌ జనం దృష్టిని ఆకర్షించాలంటే.. స్టార్‌ హీరోయిన్లతో ప్రమోషన్‌ చేయించడం ఒక మార్గంగా ప్రొడక్ట్స్‌ యాజమానులు భావిస్తుంటారు. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన ఓ ఫోన్‌ ప్రమోషన్‌ కోసం స్టార్‌ హీరోయిన్‌లతో పాటు కాస్త పేరున్న హీరోయిన్‌లు కూడా ముందుకొచ్చారు. 

సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌లో ఆ ఫోన్ పట్టుకుని వారిస్తున్న ఫోజులు చూస్తుంటే.. వామ్మో ఈ ఫోన్‌లో ఏది ఉంది.. వెంటనే కొనేయ్యాలి అనిపిస్తుంది. వాళ్లు కూడా అదే చెబుతున్నారు.. ఈ ఫోన్‌లో ఎన్నో ఆప్షన్స్‌ ఉన్నాయి. దీనికంటే గొప్పదైన 5జి ఫోన్‌ని మీరు చూసి ఉండరు అంటూ వన్‌ ప్లస్‌కు సంబంధించిన 5జి ఫోన్‌తో సోషల్‌ మీడియాలో తారలు సందడి చేస్తున్నారు.  కాజల్‌, మేఘ ఆకాష్‌, సయేషా, అనుపమ, అవనీత్‌ కౌర్‌, సోనాల్‌ చౌహాన్‌, అమైరా దస్తూర్‌, వర్ష బొల్లమ్మ వంటి తారలంతా ఈ సందడి చేసే లిస్ట్‌లో ఉన్నారు.









Advertisement
Advertisement
Advertisement