గొప్ప సౌందర్యవతిగా, హాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది ప్రముఖ తార ఏంజెలీనా జోలీ. సామాజిక స్పృహ ఉన్న సెలబ్రిటీగా కూడా పేరు తెచ్చుకుంది. 2014లో హాలీవుడ్ ప్రముఖ హీరో బ్రాడ్ పిట్‌ను వివాహం చేసుకుని ఐదేళ్లు అతడితో కాపురం చేసింది. అనంతరం 2019లో ఇద్దరూ విడిపోయారు. ఈ జంటకు మొత్తం ఆరుగురు పిల్లలు. వారిలో ముగ్గురికి ఏంజెలీనా జన్మనివ్వగా.. మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు.
బ్రాడ్ పిట్ నుంచి విడిపోయిన తర్వాత 46 ఏళ్ల ఏంజెలీనా కెనడాకు చెందిన ప్రముఖ సింగర్ ది వీకెండ్ (అసలు పేరు అబెల్ టెస్ఫాయె) తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పలుసార్లు కలిసి బయట కనిపించారు. తాజాగా ఈ ఇద్దరూ లాస్ఏంజెలెస్లోని ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్‌కు కలిసి వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు లోపల కలిసి ఉన్నారు. ఇద్దరూ నలుపు రంగు దుస్తులు ధరించి రెస్టారెంట్‌కు రావడం మీడియా కంట పడింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలకు బలం చేకూర్చాయి.