Abn logo
Mar 5 2021 @ 18:40PM

‘పిశాచు-2’లో స్టార్‌ నటుడు

కోలీవుడ్‌: మిస్కిన్‌ దర్శకత్వంలో 2014లో వచ్చిన చిత్రం ‘పిశాచు’. ఈ చిత్ర సీక్వెల్‌గా ‘పిశాచు-2’ను ఆయన ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మురుగానందం నిర్మించే ఈ చిత్రంలో ఆండ్రియా, పూర్ణ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం దిండుగల్‌లో షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ఏలగిరికి షిఫ్ట్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రకు విజయ్‌ సేతుపతిని ఎంపిక చేశారు. దీంతో ఆయన చిత్ర షూటింగ్‌ జరిగే దిండుగల్‌కు చేరుకున్నారు. ఇక్కడ తనపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలను పూర్తి చేసి తిరిగి నగరానికి రానున్నారు. 


ఇదిలావుంటే, విజయ్‌ సేతుపతి చేతిలో ఓ డజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో ‘తుగ్లక్‌ దర్బార్‌’, ‘కడైసి వ్యవసాయి’, ‘మామణిదన్‌’, ‘లాభం’, ‘ముగిళ్‌’, ‘అనబెల్‌ సుబ్రహ్మణ్యం’, ‘కరోనా కుమార్‌’, ‘ఒబామా’తో పాటు మరికొన్ని తమిళ చిత్రాలు, బాలీవుడ్‌లో ‘ముంబైకర్‌’, ‘మేరి క్రిస్మస్‌’, ‘గాంధీ టాల్క్స్‌’, మలయాళంలో ‘19(1) (ఏ)’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement