మందులు ఇకపై రోబోలు ఇస్తాయి.. చెన్నై ఆస్పత్రి విభిన్న నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-04T19:26:10+05:30 IST

కరోనా రోగుల నుంచి ఆ వ్యాధి మరోకరికి సోకకుండా.. చెన్నైలోని స్టాన్‌లీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఓ విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వ

మందులు ఇకపై రోబోలు ఇస్తాయి.. చెన్నై ఆస్పత్రి విభిన్న నిర్ణయం

చెన్నై: కరోనా రోగుల నుంచి ఆ వ్యాధి మరోకరికి సోకకుండా.. చెన్నైలోని స్టాన్‌లీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఓ విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వ సహాయంతో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆహారం మరియు మందులు ఇచ్చేందుకు ఈ ఆస్పత్రిలో రోబో నర్సులను రంగంలోకి దించింది.


రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయ్‌భాస్కర్ శుక్రవారం ఆ ఆస్పత్రిని సందర్శించి.. ఈ ‘రోబో సర్సు’లు ఎలా పని చేస్తున్నాయో పరిశీలించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రోబో ఒక జార్‌లో నీళ్లు, గ్లాసు, శానిటైజర్ బాటిల్ తదితర వస్తువులను రోగుల వద్దకు ఎలా తీసుకువెళ్తుందో గమనించారు. దీని వల్ల కరోనా రోగులకు వైద్యం అందించే డాక్టర్లు, నర్సులకు ఆ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ అవుతాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో శుక్రవారం నాటికి కొత్తగా 102 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-04T19:26:10+05:30 IST