యూఎస్‌ ఓపెన్‌కు వావ్రింకా దూరం

ABN , First Publish Date - 2020-08-09T09:10:48+05:30 IST

ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌కు దూరం కానున్న స్టార్‌ ఆటగాళ్ల జాబితాలో మాజీ చాంపియన్‌, స్విస్‌ స్టార్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా

యూఎస్‌ ఓపెన్‌కు వావ్రింకా దూరం

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌కు దూరం కానున్న స్టార్‌ ఆటగాళ్ల జాబితాలో మాజీ చాంపియన్‌, స్విస్‌ స్టార్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా చేరాడు. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో తాను ఆ గ్రాండ్‌స్లామ్‌లో ఆడడం లేదని ప్రపంచ 17వ ర్యాంకరైన వావ్రింకా ప్రకటించాడు. ‘ఆరోగ్య భద్రత రీత్యా న్యూయార్క్‌ వెళ్లాలని అనుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో యూఎస్‌ ఓపెన్‌కు దూరం కాక తప్పడం లేదు’ అని 2016 విజేత అయిన వావ్రింకా తెలిపాడు. ఈనెల 31న యూఎస్‌ ఓపెన్‌ మొదలవనుంది. వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఈ టోర్నీలో ఆడడం లేదని మహిళల నెంబర్‌వన్‌ అష్లే బార్లీ, టాప్‌ టెన్‌ క్రీడాకారిణలు స్విటోలినా, కికి బెర్టెన్స్‌తో పాటు నడాల్‌లాంటి స్టార్లు ఇప్పటికే ప్రకటించారు.  

Updated Date - 2020-08-09T09:10:48+05:30 IST