Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏకగ్రీవమా.. ఎన్నికలా?

 ‘స్టాండింగ్‌ కమిటీ’పై నేడు స్పష్టత


హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమవుతుందా, ఎన్నికలు అనివార్యమా అన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పొత్తు నేపథ్యంలో 15 మంది సభ్యులను ఆ రెండు పార్టీలు పంచుకోనున్నాయి. అధికార పార్టీ నుంచి ఎనిమిది మంది, ఎంఐఎం నుంచి ఏడుగురికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. వాస్తవంగా ఆ రెండు పార్టీలకు 15మంది సభ్యులను గెలిచే బలముంది. ఇప్పటికే నలుగురు నామినేషన్లు వేశారు. రెండు పార్టీల నుంచి 15 నామినేషన్లు దాఖలై.. బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ చేయకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఆ రెండు పార్టీల నుంచి ఒక్కరు నామినేషన్‌ వేసినా.. ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. బీజేపీ నుంచి ఒకరిని బరిలో నిలిపే అంశంపై చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా అవకాశం దక్కని టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు తమకు మద్దతిస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వాస్తవంగా బీజేపీకి ఒక్క కమిటీ సభ్యుడి స్థానం దక్కించుకునే బలం కూడా లేదు. అయినా క్రాస్‌ ఓటింగ్‌పై నమ్మకంతో పోటీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. నామినేషన్‌ వేయాలా..? వద్దా..? అన్న దానిపై నేడు పార్టీ పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారని ఓ కార్పొరేటర్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement