వెంకోజీపాలెం, జనవరి 28: అజెండాలో పొందుపరిచిన అన్ని అంశాలకూ జీవీఎంసీ స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. సంఘం చైర్మన్, నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. ఇందులో మొత్తం 33 అంశాలపై చర్చ జరిగిన అనంతరం, అన్ని అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపినట్టు చైర్‌పర్సన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ ఫణిరాం, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఇ.వాసుదేవరెడ్డి, డీసీఆర్ పి.నల్లనయ్య, జోనల్ కమిషనర్లు, పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంజినీర్లు పాల్గొన్నారు.