పాఠశాలల్లో ప్రమాణాలతో కూడిన విద్యా బోధన

ABN , First Publish Date - 2022-08-07T06:37:11+05:30 IST

పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యాబోధన సాగేలా ఎంఈవోలు దృష్టిసారించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి సూచించారు. కొప్పాకలోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లాలోని ఎంఈవోలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.

పాఠశాలల్లో ప్రమాణాలతో కూడిన విద్యా బోధన
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో లింగేశ్వరరెడ్డి

 ఎంఈవోల సమీక్షలో డీఈవో లింగేశ్వరరెడ్డి ఆదేశం

అనకాపల్లి రూరల్‌, ఆగస్టు 6 : పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యాబోధన సాగేలా ఎంఈవోలు దృష్టిసారించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి సూచించారు. కొప్పాకలోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లాలోని ఎంఈవోలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.  నెలవారీ టూర్‌ ప్రొగ్రామ్‌ను ఎంఈవోలు విధిగా తెలియపర్చాలన్నారు.  జూలై నెలలో పర్యటించిన పాఠశాలలు, తనిఖీ నివేదికలపై ఆరా తీశారు.  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేటగిరీల వారీగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఖాళీల వివరాలను నమోదు చేసుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఉన్న సబ్జెక్టుల వారీగా టీచర్ల కొరతను తెలుసుకున్నారు. ఉదయం పది గంటల లోపు అటెండెన్స్‌ యాప్‌లో కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నమోదు, బేస్‌లైన్‌ పరీక్షల మార్కులు అప్‌లోడ్‌ చేయకపోవడంపై  డీఈవో అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-07T06:37:11+05:30 IST