May 11 2021 @ 17:40PM

ఆకర్షిస్తోన్న ‘స్టాండ‌ప్ రాహుల్‌’ స్పెష‌ల్ పోస్ట‌ర్

రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘స్టాండ‌ప్ రాహుల్‌’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సాంటో మోహన్ వీరంకి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నారు. మే 11న హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు కావడంతో.. చిత్రం నుంచి ఒక స్పెషల్ పోస్టర్‌ను మంగళవారం చిత్రయూనిట్ విడుదల చేసింది.


రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే ఒక డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ అంద‌రి ఆకర్షించిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ ఆసక్తికరంగా ఉండ‌డం, యూబ‌ర్‌-కూల్‌గా రాజ్‌త‌రుణ్ ఉన్న స్టైలిష్ లుక్.. సినిమాపై దృష్టిపడేలా చేసింది. తాజాగా పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తోంది. వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం,  శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు. వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.