స్టాంపుల కొరతకు చెక్‌..

ABN , First Publish Date - 2021-04-16T05:27:08+05:30 IST

నూతన విధానంతో స్టాంపుల కొరతకు చెక్‌ పడనుంది. జిల్లాలోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు, స్టాంప్‌ వెండర్లతోపాటు తపాలాశాఖ కార్యాలయాల్లోనూ నాన జుడీషియల్‌ స్టాంపులు విక్రయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్టాంపుల కొరతకు చెక్‌..

తపాలాశాఖ కార్యాలయాల్లోనూ విక్రయాలకు శ్రీకారం

నూనత విధానంతో ధరల దోపిడీకి అడ్డుకట్ట

పాత స్టాంపుల మాఫియా ఆటకట్టు


అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 15: నూతన విధానంతో స్టాంపుల కొరతకు చెక్‌ పడనుంది. జిల్లాలోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు, స్టాంప్‌ వెండర్లతోపాటు తపాలాశాఖ కార్యాలయాల్లోనూ నాన జుడీషియల్‌ స్టాంపులు విక్రయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో స్టాంపులు కావాలంటే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలతోపాటు స్టాంపు వెండర్ల వద్దకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఈ క్రమంలో కొందరు చేతివాటం ప్రదర్శించి, అధిక రేట్లకు విక్రయిస్తూ దోపిడీ చేసేవారు. తరచూ స్టాంపుల కొరత తలెత్తుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. వీటిని గుర్తించి, త పాలాశాఖ కార్యాలయాల్లోనూ నాన జుడీషియల్‌ స్టాంపు లు విక్రయించేందుకు ప్రభుత్వం తెరలేపింది. ఇప్పటికే జిల్లాలో కొన్ని తపాలాశాఖ కార్యాలయాల్లో స్టాంపుల విక్రయాలు ప్రారంభించారు.


రెండు శాఖల సమన్వయంతో..

ఇదివరకు జిల్లాలోని 21 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలతోపాటు స్టాంప్‌ వెండర్ల వద్ద మాత్రమే స్టాంపుల విక్రయాలు సాగేవి. స్టాంపుల ముద్రణ ఆలస్యమైనపుడు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవారు. మరికొందరు స్టాంపుల కొరత సృష్టించి, వాటి ధరలను అమాంతం పెంచి, క్రయ విక్రయదారులను దోపిడీ చేసేవారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషనతోపాటు తపాలాశాఖ ఉన్నతాధికారులు చర్చించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడంతో జిల్లాలో వారం రోజులుగా తపాలాశాఖ కార్యాలయాల్లో కూడా స్టాంపుల విక్రయాలు ప్రారంభించారు. తొలుత పట్టణ, మండల కేంద్రాల్లోని తపాలాశాఖ కార్యాలయాల్లో విక్రయిస్తున్నట్లు ఆ శాఖాధికారులు తెలిపారు. త్వరలోనే జిల్లావ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు.


పాత స్టాంపుల మాఫియాకు అడ్డుకట్ట

ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానంతో కొంతవరకు అధిక ధరలకు విక్రయించే స్టాంప్‌ వెండర్లతోపాటు కొందరు రిజిస్ట్రేషనశాఖ ఉద్యోగుల దోపడీకి అడ్డుకట్ట వేసిన ్డట్లయింది. జిల్లాలో పెరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నేపథ్యంలో కొందరు భూ మాఫియాకు పాల్పడే రియల్‌ వ్యాపారులు స్టాంప్‌ వెండర్లతో కుమ్మక్కై, పాత తేదీలతో కూడి, స్టాంపు పేపర్లను సృష్టించి, వాటి ఆధారంగా రాత్రికి రాత్రే భూములు, విలువైన స్థలాలకు సం బంధించి నకిలీ పత్రాలు సృష్టించేవారు. ఇలాంటివి జిల్లాలో ఇప్పటికే కోకొల్లలు. 

ఇలాంటి వ్యవహారాలతో పలువురు కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. పోలీసుల దర్యాప్తులో ఇలాంటి ముఠాల వెనుక కొందరు స్టాంపు వెండర్లున్నట్లు తేలింది. కొందరు స్టాంపు వెండర్లు ఎప్పటిక ప్పుడు స్టాం పుల విక్రయాలు తదితర లెక్కలు సంబంధిత సబ్‌ రిజిసా్ట్రర్‌కు చెప్పకుండా తొక్కిపెడుతూ ఇలాంటి వాటికి పాల్పడుతున్నారనే విమర్శలు జిల్లాలో లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టి స్టాంపుల మాటున సాగుతన్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని, ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు.






Updated Date - 2021-04-16T05:27:08+05:30 IST