Stalinతో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ భేటీ

ABN , First Publish Date - 2021-12-14T15:31:43+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌, రాష్ట్ర ఆర్థిక సలహాకమిటీ సభ్యుడు రఘురామ్‌ రాజన్‌ కలుసుకున్నారు. సచివాలయంలో సోమవారం ఉదయం ఆయన స్టాలిన్‌ను

Stalinతో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ భేటీ

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌, రాష్ట్ర ఆర్థిక సలహాకమిటీ సభ్యుడు రఘురామ్‌ రాజన్‌ కలుసుకున్నారు. సచివాలయంలో సోమవారం ఉదయం ఆయన స్టాలిన్‌ను కలుసుకున్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చినవెంటనే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచే నిమిత్తం ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌, అరవింద్‌ సుబ్రమణియన్‌, ఆర్థిక నిపుణుడు జాన్‌ ట్రీస్‌,డ ఆక్టర్‌ ఎస్‌. నారాయణన్‌లతో ఆర్థిక సల హాకమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు తరచూ ముఖ్యమంత్రిని, ఆర్థికమంత్రిని కలుసుకుని రాష్ట్ర ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు తగు సలహాలను కూడా అందిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా క్షీణించిన ఆర్థికస్థితిని ఈ కమిటీ సభ్యుల సలహాలతో మెరుగుపరచే దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సచివాలయంలో రఘురామ్‌రాజన్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విషయమై చర్చలు జరిపారు. ఈ చర్చలలో ఆర్థిక మంత్రి పీటీఆర్‌ పళనివేల్‌రాజన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.మురుగానందం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-14T15:31:43+05:30 IST