చెన్నై: భారత 75వ గణతంత్ర వేడుకల పరేడ్‌లో తమిళనాడుకు చెందిన శకటానికి మోదీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 26న న్యూఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ‘స్వాతంత్ర్య పోరాటంలో తమిళనాడు పాత్ర’ అనే శకటాన్ని ప్రదర్శించడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ శకటానికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్టాలిన్ లేఖ రాశారు.
తయారు చేసినట్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళనాడుకు చెందని స్వాతంత్ర్య సమరయోధులతో శకటాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. నిపుణులతో రూపొందించిన ఈ శకటాన్ని మూడుసార్లు ప్రతిపాదనకు పంపగా.. మొదటిసారే ఆమోదం లభించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వకపోవడం విచారకరమని స్టాలిన్ అన్నారు.
ఇవి కూడా చదవండి