స్టాలిన్‌ సహా 18 మంది ఎమ్యెల్యేలకు హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2021-04-20T16:35:51+05:30 IST

హైకోర్టు ఆ నోటీసు రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శాసనసభ కార్యదర్శి హైకోర్టులో అప్పీలు పిటి షన్‌ దాఖలు చేశారు.

స్టాలిన్‌ సహా 18 మంది ఎమ్యెల్యేలకు హైకోర్టు నోటీసులు

చెన్నై: శాసనసభలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల ను ప్రదర్శించిన కేసుకు సంబంధించి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్‌ సభ్యుడు కేకే సెల్వంకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారంటూ 2017లో అసెంబ్లీలో స్టాలిన్‌, సహా 21 మంది ఎమ్మెల్యేలు గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించారు. దీనితో స్పీకర్‌ ధనపాల్‌ ఆ సంఘటనపై సభాహక్కుల సంఘం సమావేశం జరిపి ఆ 21 మందికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు. హైకోర్టు ఆ నోటీసు రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శాసనసభ కార్యదర్శి హైకోర్టులో అప్పీలు పిటి షన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ఆ పార్టీకి చెందిన 18 మంది శాసనసభ్యులు, ఇండిపెండెంట్‌ సభ్యుడు కేకే సెల్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ నోటీసు జారీ చేసింది.

Updated Date - 2021-04-20T16:35:51+05:30 IST