గాలికి కొట్టుకొచ్చి.. విమానం రెక్కలను ఢీకొన్న స్టెయిర్ ల్యాడర్!

ABN , First Publish Date - 2020-06-07T00:14:01+05:30 IST

ఎయిర్‌పోర్టులో ఉన్న ఓ స్టెయిర్ ల్యాడర్ గాలికి కొట్టుకొచ్చి ఇండిగో సంస్థకు చెందిన విమానాన్ని ఢీకొట్టింది.

గాలికి కొట్టుకొచ్చి.. విమానం రెక్కలను ఢీకొన్న స్టెయిర్ ల్యాడర్!

ముంబై: ఎయిర్‌పోర్టులో ఉన్న ఓ స్టెయిర్ ల్యాడర్ గాలికి కొట్టుకొచ్చి ఇండిగో సంస్థకు చెందిన విమానాన్ని ఢీకొట్టింది. ఈ స్టెయిర్ ల్యాడర్(విమానంలోకి వెళ్లేందుకు ఉపయోగించే మెట్లు) స్పైస్‌జెట్ సంస్థకు చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. శనివారం ఉదయం బలమైన గాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఆ గాలికి స్టెయిర్ ల్యాడర్ కొట్టుకు వచ్చిందని, తమ కంపెనీకి చెందిన విమానాన్ని ఢీకొట్టిందని ఇండిగో సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇంజిన్‌కు, వింగ్‌లెట్‌కు మధ్య భాగంలో ఈ ల్యాడర్ బలంగా తాకిందని చెప్పారు. మహారాష్ట్రలో నిసర్గ తుఫాన్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-06-07T00:14:01+05:30 IST