తడిసిన వేరుశనగ

ABN , First Publish Date - 2021-10-25T06:24:37+05:30 IST

పదిరోజులుగా కురుస్తు న్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పొలంలో తొలగించిన వేరుశన గ నూర్పిడి చేసుకోడానికి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

తడిసిన వేరుశనగ
కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో తడిసిన వేరుశనగ


ఆత్మకూరు, అక్టోబరు24 : మండలంలో పదిరోజులుగా కురుస్తు న్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పొలంలో తొలగించిన వేరుశన గ నూర్పిడి చేసుకోడానికి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మండలంలో జూన మెదటివారంలో విత్తనం వేసిన పంటను తొల గించకపోతె మొలకలు వస్తాయన్న భయంతో చాలా మంది రైతులు పంట తొలగించారు. ఆత్మకూరు, పీ సిద్దరాంపురం, ముట్టాల, గొరి దిండ్ల, సనప, రంగంపేట తదితర గ్రామాల్లో వెయ్యి ఎకరాలకు పైగా పంట తొలగించారు. అయితే ఎడతెరిపిలేని వర్షానికి తడిసి ముద్దయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో  పొలాల్లోనే బెట్టగా ఉన్న ప్రాంతానికి పంటను కూలీలు ద్వారా తరలించి నూర్పి డి చేసుకోడానికి చాలా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన గోవిందరెడ్డి అనే రైతు తన ఐదెకరాల పొలంలో తొలగించిన పంట పూర్తిగా తడిసిపోయింది. కుళ్లిపోతుందన్న భయంతో కూలీల సాయంతో మరోచోటుకు  తరలిస్తున్నట్లు తెలిపాడు. కనీసం పెట్టు బడి రాదన్నాడు. గత సంవత్సరం కూడా ఇలాగే వర్షం కారణం గా తీవ్రంగా నష్టపోయామని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఈసారైనా తగిన నష్టపరిహారం అందించాలనికోరారు.

కనగానపల్లి: మండలవ్యాప్తంగా మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వేరుశనగ పంటకు తీవ్ర నష్టం మిగిల్చింది. మండ లంలోని మామిళ్లపల్లిలో రైతులు వాసుదేవరెడ్డి, సువర్ణమ్మ, క్రిష్ణారె డ్డి మూడు రోజుల క్రితం వేరుశనగను తొలగించారు. అయితే మం డలంలో ఇటీవల కురుస్తున్న వర్షానికి బాగా తడిసిపోయింది. వర్షా నికి కట్టె అంతా కుళ్లిపోయి కాయలు మొలకెత్తుతున్నాయని, దీంతో పెట్టుబడి కూడా దక్కదని రైతులు వాపోయారు. వర్షానికి తడిసిన పంటలను వీఆర్‌ఓ చెన్నకేశవులు, ఎంపీఈఓ రుక్మిణీ పరిశీలించారు. పంటన ష్టాన్ని ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని తెలిపారు. 



Updated Date - 2021-10-25T06:24:37+05:30 IST