స్టఫ్డ్‌ టొమాటో

ABN , First Publish Date - 2021-06-25T16:32:26+05:30 IST

బెంగళూరు టొమాటోలు- ఆరు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, ఎండు కొబ్బరి- పావు కప్పు, కారం- రెండు స్పూన్లు, గరం మసాలా- అర స్పూను, ఆవాలు- స్పూను, పసుపు, ఇంగువ- కొద్దిగా, బెల్లం- పావు కప్పు

స్టఫ్డ్‌ టొమాటో

కావలసిన పదార్థాలు: బెంగళూరు టొమాటోలు- ఆరు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, ఎండు కొబ్బరి- పావు కప్పు, కారం- రెండు స్పూన్లు, గరం మసాలా- అర స్పూను, ఆవాలు- స్పూను, పసుపు, ఇంగువ- కొద్దిగా, బెల్లం- పావు కప్పు, కొత్తిమీర తురుము- సగం కప్పు


తయారు చేసే విధానం: టొమటోలు సగానికి కట్‌ చేసి లోపలిదంతా తీసివేయాలి. ఓ గిన్నెలో ఉల్లిగడ్డ. ఎండు కొబ్బర, బెల్లం, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాను ఒక్కో టొమాటోలో నింపాలి. వెడల్పాటి ప్యాన్‌లో నూనె వేసి ఆవాలు, ఇంగువ వేసి చిటపటలాడించి మసాలా నింపిన ఒక్కో టొమాటోను అందులో పెట్టి సన్నటి మంట మీద మగ్గనివ్వాలి. ఇది చపాతీ, పరాఠాలతో తింటే బాగుంటుంది.


Updated Date - 2021-06-25T16:32:26+05:30 IST