ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ఆయిల్‌ కంపెనీల సిబ్బంది

ABN , First Publish Date - 2021-05-06T08:01:54+05:30 IST

ఆయిల్‌ పరిశ్రమ సిబ్బందిని కరోనాపై పోరులో ముందువరుస సిబ్బందిగా గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌..

ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ఆయిల్‌ కంపెనీల సిబ్బంది

 ప్రత్యేక శిబిరాల ద్వారా టీకా పంపిణీ

హైదరాబాద్‌, మే 5(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌ పరిశ్రమ సిబ్బందిని కరోనాపై పోరులో ముందువరుస సిబ్బందిగా గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌.. కలెక్టర్లకు బుధవారం లేఖ రాశారు. వీరంతా ప్రజలకు దగ్గరగా ఉంటూ విధులు నిర్వహించేవారని  పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేేస రిటైల్‌ ఔట్‌లెట్లు, డిస్ట్రిబ్యూటర్లు, డిపోలు, టెర్మినల్స్‌, ఎల్పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌ సిబ్బందిని రక్షించుకోవడానికి వ్యాక్సిన్‌ అనివార్యమని తెలిపారు. ప్రత్యేక శిబిరాలు ద్వారా వీరికి టీకా వేయాలని కలెక్టర్లకు సూచించారు.

Updated Date - 2021-05-06T08:01:54+05:30 IST